Sunday, 26 July 2020

అర్జున్ మేనల్లుడి టాలీవుడ్ ఎంట్రీ.. రష్మికతో రొమాన్స్

యాక్షన్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్నడ చిత్రసీమ‌లోని స్టార్ యాక్టర్లలో ఒక‌రైన ధృవ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పొగ‌రు’. హ్యాట్రిక్ యాక్షన్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధృవ స‌ర‌స‌న నాయిక పాత్రను ర‌ష్మికా మంద‌న పోషిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతోన్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ‘విక్టరీ’, ‘అధ్యక్షా’, ‘ర‌న్న’, ‘ముకుంద మురారి’ వంటి హిట్ సినిమాలతో డైరెక్టర్‌గా నంద‌కిశోర్ మంచి పేరు సంపాదించారు. Also Read: డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్యక్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ‘పొగ‌రు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 6న ఈ సినిమాలోని మొద‌టి పాట ‘క‌రాబు’ విడుద‌ల‌తో తెలుగు వెర్షన్ ప్రమోష‌న్స్‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు పాపుల‌ర్ క‌న్నడ మ్యూజిక్ డైరెక్టర్ చంద‌న్ శెట్టి బాణీలు అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎస్‌.డి. విజ‌య్ మిల్టన్‌, ఎడిట‌ర్‌గా కె.ఎం. ప్రకాష్ ప‌నిచేస్తున్నారు. సంప‌త్ రాజ్‌, ధ‌నంజ‌య్‌, ర‌విశంక‌ర్‌, ప‌విత్రా లోకేష్‌, గిరిజా లోకేష్ వంటి పేరుపొందిన న‌టులు న‌టిస్తోన్న ఈ చిత్రంలో ‘డ‌బ్ల్యుడ‌బ్ల్యుఈ’ స్టార్లు కై గ్రీన్‌, మోర్గాన్ ఆస్టే, జో లిండ్నర్‌, జాన్ లూకాస్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. చిక్కన్న, రాఘ‌వేంద్ర రాజ్‌కుమార్‌, క‌రి సుబ్బు, ధ‌ర్మా, మ‌యూరి, త‌బ‌లా నాని ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hzi3cD

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...