Sunday, 26 July 2020

మదనపల్లి: కాడెద్దులుగా బాలికలు.. చలించిపోయిన నటుడు సోనూసూద్

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల కష్టాలు పడుతున్న వలస కార్మికులను ఆదుకుంటూ ప్రముఖ సినీ నటుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు సోనూ సూద్ ముందుకొచ్చారు. తండ్రి వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు కాడెద్దులుగా మారిన కూతుళ్లను వీడియోలో చూసిన ఆయన చలించిపోయారు. ఆ కుటుంబానికి ఓ ట్రాక్టర్ పంపుతానని వెల్లడించారు. ఈ సాయంత్రానికల్లా ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతుందని ఆ రైతుకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం సోనూసూద్ ట్వీట్ చేశారు. Must Read: చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు చెందిన టమోటా రైతు తన పొలం దున్నేందుకు డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఖరీఫ్ సీజన్ కావడంతో అటు పొలం పనులు మొదలు పెట్టలేక.. దున్నేందుకు ఎద్దులు గాని, ట్రాక్టర్‌తో దున్నించేందుకు స్థోమత లేక సతమతమయ్యాడు. ఈ తరుణంలో ఆయన కన్న బిడ్డలే కాడి పట్టుకు నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇది ఓ జర్నలిస్ట్ కెమెరా కంటికి చిక్కగా.. ఆయన తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోనూసూద్ కంట పడింది. వెంటనే సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు. కొంతసేపటి తర్వాత వారు ఎద్దులు పొందడానికి అర్హులు కాదు.. వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. Also Read: ‘‘రేపు ఉదయానికల్లా ఆయన పొలంలో ఓ జత ఎద్దులు ఉంటాయి. ఇకపై ఆ బాలికలు చదువుపై దృష్టిసారించాలి. రేపు ఉదయం నుంచే రెండు ఎద్దులు వారి పొలాలను దున్నుతాయి. రైతు మన దేశానికి గర్వకారణం’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. కాసేపటి తర్వాత.. ‘‘ఈ ఫ్యామిలీకి జత ఎద్దులు పొందేందుకు అర్హత లేదు. వీరు ఓ ట్రాక్టర్ తీసుకునేందుకు పూర్తిగా అర్హులు. కాబట్టి వీరి కోసం ఓ ట్రాక్టర్ పంపుతాను. సాయంత్రాని కల్లా ఆ ట్రాక్టర్ పొలాన్ని దున్నుతుంది.’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. మొత్తానికి సోనూ సూద్ తన పెద్ద మనసుతో మరో పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. Must Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WZoy0i

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...