Saturday, 4 July 2020

నేను బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తున్నానని తెలియగానే!! బ్రహ్మానందం షాకింగ్ రియాక్షన్

హాస్య బ్రహ్మ, సీనియర్ కమెడియన్ వెండితెరకు గుడ్ బై చెప్పబోతున్నారని, ఇకపై ఆయన బుల్లితెర సీరియల్స్ చేస్తూ నవ్వించనున్నారని గత రెండు రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై బ్రహ్మానందం రియాక్ట్ అయ్యారు. టీవీ సీరియల్స్‌లో నటించాలనే ఆలోచనే తనకు లేదని చెబుతూ అట్టి వార్తలను ఖండించారు. ''ఎవరో కావాలనే పుట్టించిన వార్త తప్పితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. అసలు నేను అనని మాటలను ఊహించుకుని ఎలా ప్రచారం చేస్తారో నాకే అర్థం కావడం లేదు. ఆ వార్తలు చూసి ఆశ్చర్యపోయా. ఇక నేను బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తున్నానని తెలిసి నా దగ్గరి వాళ్లంతా ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతున్నారు. సమాధానం చెప్పలేకపోతున్నాను'' అన్నారు బ్రహ్మానందం. Also Read: లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటున్నానని, ఇంట్లో నుంచి కాలు బయటపెట్టి మూడున్నర నెలలు అయిందని బ్రహ్మానందం చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇంకా కొన్ని రోజులపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని డిసైడ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ లాక్‌డౌన్‌ సమయంలో బోలెడన్ని పుస్తకాలు చదివానని చెప్పిన బ్రహ్మానందం.. ఖురాన్‌ కూడా అధ్యయనం చేశానని అన్నారు. ఆ పవిత్ర గ్రంథంలో ఏయే అంశాలున్నాయి? మహమ్మద్‌ ప్రవక్త ఏం చెప్పాడు? అనే విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. అంతేకాదు ఇంట్లో మనవడితో ఆటలాడుతుంటే సమయమే తెలియడం లేదని, చాలా సరదాగా అనిపిస్తోందని బ్రహ్మి చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gpfj0L

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...