Saturday, 4 July 2020

Green India Challenge: పిల్లలకు ఈ విషయం తప్పనిసరిగా తెలియాలి.. అందుకే ఆ ముగ్గురు: అల్లు శిరీష్

మొక్కల పెంపకం సామాజిక బాధ్యతగా గుర్తు చేస్తూ.. టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒక మంచి పనిని మనం చేయడంతో పాటు మరో ముగ్గురు చేసేలా చేయడమే అసలైన ఛాలెంజ్ అంటూ తాము మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్‌ను విసురుతుండటంతో ఈ టాలీవుడ్‌లో విప్లవంలా మారింది. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌లో.. అమల, రేణు దేశాయ్, కీర్తి సురేష్, వీవీ వినాయక్, పూనమ్ కౌర్, అడవి శేషు, ఉదయభాను, విశ్వక్ సేన్, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, శ్రీముఖి, మంగ్లీ, యాంకర్ సుమ, వరుణ్ తేజ్, మంచు లక్ష్మి తదితరులు భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బ్రదర్ తనవంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వ‌క్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటారు హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్ప‌ుడున్న జీవిన‌విధానంలో ప‌ర్య‌వ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అత్యంత అవ‌స‌రం. అందుకే విధిగా మ‌నంద‌రం స్వ‌చ్ఛందంగా మొక్క‌లు నాటాల‌ని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విశ్వ‌క్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి.. నా మేన‌ల్లుడు ఆర్నావ్, మేన‌కోడ‌ల్లు అన్విత‌, స‌మారా, నివ్రితిల‌ను ఈ కార్య‌క్ర‌మానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త త‌రానికి చెట్ల‌ను, ఏ విధంగా నాటాలి, పెంచాల‌నే విష‌యం తెలియ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అందుకే త‌న మేన‌ల్లుడు, మేన‌కోడ‌ల్ల‌కి ఈ ఛాలెంజ్ స్వీక‌రించాల్సిందిగా నామినేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన త్వ‌ర‌లోనే రాబోతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iB6MtN

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...