Thursday, 16 July 2020

ఇక ఆమెతో ఎలాంటి సంబంధం లేదు.. 45 లక్షలు నొక్కేసి ఇలా!! హీరో విశాల్ అఫీషియల్ స్టేట్‌మెంట్

తమిళ హీరో విశాల్‌కు, ఆయన నిర్మాణ సంస్థ అకౌంటెంట్ రమ్యకు మధ్య గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ కంపెనీలో గత కోనేళ్ళుగా డబ్బు మాయమవుతోందని, కంపెనీ అకౌంట్స్ నుంచి అనే వ్యక్తి దాదాపు 45 లక్షలు కాజేసిందని పేర్కొంటూ ఫిల్మ్ ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఇష్యూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఆ వెంటనే దీనిపై స్పందించిన రమ్య.. విశాల్, అతని మేనేజర్ హరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని పేర్కొంది. వారు సరిగ్గా ట్యాక్స్‌లు కట్టడం లేదని, వాటి నుంచి తప్పించుకునేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హాట్ ఇష్యూ అయిన ఈ విషయమై తాజాగా విశాల్ నిర్మాణ సంస్థ అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఇకపై రమ్యకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. Also Read: ''మా కంపెనీలో చాలా ఏళ్ల నుంచి చీఫ్ అకౌంటెంట్‌గా రమ్య పనిచేస్తోంది. కొన్నేళ్ల నుంచి మా నిధులు దాదాపు 45 లక్షల రూపాయలు కాజేసిందనే విషయాన్ని సాధారణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఆమెపై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాము. ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి రమ్యతో ఎవరైనా, ఏదైనా ఆర్థిక కార్యకలాపాలు జరిపి ఉంటే దానికి మీరే బాధ్యులు. ఆమెకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. రమ్యతో మీరు జరిపిన ఆర్థిక వ్యవహారాలపై మా బాధ్యత ఎంత మాత్రం లేదు'' అని పేర్కొంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ యాజమాన్యం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39bht1F

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....