Thursday 16 July 2020

Chiranjeevi: ఇది ఓ లైఫ్ టైమ్ మెమోరీ.. చిరంజీవితో‌ వీడియోపై కార్తికేయ, ఈషా రెబ్బా ఎమోషనల్ ఫీలింగ్స్

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అంటూ మరోసారి జనాల్లో అవగాహన తీసుకొచ్చారు మెగాస్టార్ . ఈ మేరకు అచ్చ తెలుగు అందం , యంగ్ హీరో కార్తికేయలతో రెండు వేరు వేరు వీడియోలు చేసి అందరికీ అర్థమయేలా మెగా సందేశమిచ్చారు. కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తనదైన స్టైల్‌లో చెప్పారు. కరోనా వ్యాప్తి కాకుండా ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంటూ చిరంజీవి, కార్తీకేయ కలిసి వీడియో చేశారు. ఇందులో యంగ్ హీరో మాస్క్ ధరించకుండా మీసాలు దువ్వకుంటుంటే.. ''మీసం మెలేయటం వీరత్వామే.. కాని అది ఒకప్పుడు, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మాస్క్‌ ధరించడమే వీరుడి లక్షణం'' అని చిరంజీవి సూచించడం అందరినీ అట్రాక్ట్ చేస్తూనే అసలు విషయాన్ని సున్నితంగా చేరవేసింది. ఈ వీడియోకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. Also Read: దీంతో ఆనందంతో పొంగిపోయిన హీరో కార్తికేయ.. చిరంజీవితో ఈ వీడియో చేయడం పట్ల తన ఫీలింగ్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ''కరోనా భయం, షూటింగ్స్ మిస్ అవ్వడం, నెక్ట్స్ ఎలా ఉంటుందో అని భయం అన్ని తీరిపోయాయ్.. ఈ ఒక్క వీడియోతో మెగాస్టార్ గారితో నేను కలిసి ఒక మంచి పని కోసం వీడియో చేయడం, నా సినిమాలు పది రిలీజైనా ఈ కిక్కు రాదు.. చిరంజీవి సర్‌తో మరో లైఫ్ టైమ్ మెమోరీ ఇది'' అని పేర్కొన్నాడు. మరోవైపు చిరంజీవి సైతం ''నా ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు'' అంటూ కార్తికేయ, ఈషా రెబ్బాలకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఈషా.. ''నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సర్.. ఓ గొప్ప పని కోసం సినీ పరిశ్రమను ఆదుకునేందుకు సీసీసీ మన కోసం అనే సంస్థ ఏర్పాటు చేసి మమ్మల్ని అందర్నీ అక్కున చేర్చుకున్నారు'' అని పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/398cAGO

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...