Friday, 24 April 2020

MLA Roja: రోజా గారో.. కుక్క మొరిగిందనుకోండి, గతం గిర్రున తిప్పితే శ్రీరెడ్డీ!

కరోనా టైంలో రోజాకు పూల స్వాగతం.. ఈ వీడియోతో ఎమ్మెల్యే రోజాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. పుత్తూరులోని సుందరయ్య నగర్‌లో బోరు బావి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాకు అక్కడి స్థానిక మహిళలు పూల స్వాగతం పలికారు. నడుస్తూ ఉంటే చాలా మంది మహిళలు ఆమె కాళ్లపై పూలు జల్లుతూ అభిమానాన్ని చూపించారు. అయితే రోజా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆమెపై సోషల్ మీడియా విరుచుకుపడుతున్నారు. ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయడంతో రోజా కూడా తనదైన శైలిలో స్పందించారు. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ తాట తీస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ బాబు, చంద్రబాబులకు చురకలేశారు. మొత్తానికి ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా.. వైల్డ్ ఎంట్రీ ఇచ్చేశారు వివాదాస్పద నటి . ‘రోజా గారూ.. నా ఫుల్ సపోర్ట్ మీకే.. మీరు పేద ప్రజలకు మంచి మంచి పనులు చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి. మొరిగే కుక్కలు ప్రతిచోటా ఉంటాయి.. అధైర్య పడకండి.. మీరు ఒంటరి కాదు.. మీకు సపోర్ట్‌గా మేం ఉన్నాం’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి.. రోజాపై కామెంట్స్ చేసిందా?? పైగా ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తూ ఆకాశానికెత్తేశారా..?? గతంలో కూడా ఏదో అన్నారే అని కాస్త ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే.. ఆమె ఈమెనా? అని సందేహాలు కలిగేలా కొన్ని ప్రమాదకరమైన కామెంట్స్ జ్ఞ‌ప్తికి వస్తున్నాయి. అప్పట్లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో నటి, ప్రముఖ టీవీ ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్ నిర్వాహకురాలుకి సంబంధాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి.. ఆ నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ అప్పట్లో ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టి అగ్గిరాజేసింది. ‘రోజా గారు మీరు వైసీపీలో ఉన్నందుకు నా పూర్తి మద్దతు, మిమ్మల్ని కించపరచాలని కాదు. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం’, ‘మీ రచ్చబండ లేదా బతుకు జడ్కా బండికి వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా’ అంటూ అప్పట్లో ఎమ్మెల్యే రోజాని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు, చీకటి వ్యవహాలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది కాబట్టి.. వీటిని అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇవే కాదు.. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో శ్రీరెడ్డి పాపులారిటీ కోసమే ఇలా చేస్తుందని రోజా వ్యాఖ్యానించడంతో శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా గతం.. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లోనే కాదు.. సినిమాల్లోనూ ఉండరనడానికి ఇదో ఉదాహరణ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bBEb3z

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr