
మెగాస్టార్ మంచి చమత్కారి. ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్లకు వెళ్లినా పంచ్‌లు ప్రవాహంలా వేసేస్తున్నారు. అంతెందుకు ఆ మధ్య బిగ్ బాస్ షో ఫైనల్‌కి వెళ్లి పంచ్‌లతో రఫ్పాడించి హోస్ట్ నాగార్జుననే డామినేట్ చేసేశారు. ఆ తరువాత ఈ ఫంక్షన్లో మెగాస్టార్ మైక్ అందుకున్నా ఛలోక్తుల్ని బ్రేక్ డాన్స్ చేయిస్తున్నారు. ఇక రాననుకున్నారా.. రాలేననుకున్నారా అంటూ ఉగాది కానుకగా ట్విట్టర్‌లో మెగా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ ట్వీట్‌లతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు, పూరీ జగన్నాథ్‌లను ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌లు వైరల్ అయ్యాయి. ఇక చిరుకి ఆహ్వానం పలుకుతూ పూరీ ట్వీట్ చేయడంతో పూరికి మాత్రం పగిలిపోయే రిప్లై ఇచ్చారు చిరు. చిరు చమత్కారంతో నా చెంప పగిలిపోయిందని అంటున్నారు స్టార్ దర్శకుడు . కరోనా ప్రభావంతో దేశం మొత్తం కర్ఫ్యూ ఉండటంతో.. పూరీ.. నువ్.. ముంబై, బ్యాంకాక్ బీచ్‌లను బాగా మిస్సవుతున్నట్టు ఉన్నారు. అయితే నీ భార్యాపిల్లలతో సమయం గడుపుతున్నందుకు వారు బాగా సంతోషిస్తూ ఉండి ఉంటారు’ అంటూ ఆ.. ఉద్దేశం వచ్చేలా మెగాస్టార్ ట్వీట్ వదిలారు. అయితే చిరు సార్ ట్వీట్‌తో నా కొంపముంచింది అంటూ తన భార్యతో జరిగిన సరదా సంభాషణను ప్రేక్షకులతో పంచుకున్నారు పూరీ. ఒకపక్క లాక్ డౌన్ ఉంటే చిరు సార్‌కి బ్యాంకాక్ టాపిక్ అనవసరంగా గుర్తుకువచ్చింది.. ఆయన ట్వీట్ చూసిన నా భార్య పాత విషయాలు అన్నీ గుర్తుకు వచ్చాయి. వెంటనే నా చెంప పగలగొట్టింది (నవ్వుతూ).. నిజానికి చిరు సార్ అన్నట్టు నా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. టైంకి తింటున్నా.. టైంకి పడుకుంటున్నా.. సినిమా కథ కూడా రాస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు పూరీ. Read Also:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dUzEe6
No comments:
Post a Comment