Saturday 25 April 2020

పోలీసుల చర్యలపై చంద్రబోస్ పాట.. చిరంజీవి రియాక్షన్

దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ కరోనా నివారణలో భాగం కావాలని చెప్పారు. మరోవైపు ప్రజలు రోడ్లపైకి రాకుండా, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటూ రేయింబవళ్లు డ్యూటీ చేస్తున్నారు పోలీస్ అన్నలు. అయితే ఈ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణపై ప్రజల్లో అవగాహన నింపుతూ అద్భుతమైన పాట రాసి ఆలపించారు . ఈ పాట చూసిన మెగాస్టార్ చిరంజీవి.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ విలువైన సందేశమిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ‘‘కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన కోసం పోరాడుతోంది పోలీస్ శాఖ. పోలీసులందరినీ గౌరవిద్దాం, వాళ్లకు సహకరిద్దాం. చంద్రబోస్ రాసి పాడిన ఈ పాట పోలీస్ శాఖ గొప్పతనాన్ని తెలుపుతూ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను, సైబరాబాద్ పోలీస్‌ను ట్యాగ్ చేశారు మెగాస్టార్. కాగా ఈ సందేశాత్మక పాటను సీపీ సజ్జనార్ సూచన మేరకు రాశానని చంద్రబోస్ తెలిపారు. కరోనా విలయతాండం చేస్తున్న ఈ పరిస్థితుల్లో పోలీసుల విధి నిర్వహణ చాలా గొప్పగా ఉందని, చాలామంది ప్రజలు వారికి సహకరిస్తున్నారని, కొందరు మాత్రమే సహకరించడంలేదు కాబట్టి అందరిలో అవగాహన వచ్చేలా ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తనను అడిగారని చెప్పారు చంద్రబోస్. ఈ నేపథ్యంలోనే ‘ఆలోచించండి అన్నలారా, ఆవేశం మానుకోండి తమ్ముల్లారా..’ అంటూ ఎంతో బాధ్యతతో ఈ పాట రాశానని ఆయన తెలిపారు. ఈ పాట రాసిన చంద్రబోస్‌ని సీపీ సజ్జనార్ స్వయంగా సత్కరించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VW14In

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...