Thursday, 23 April 2020

సీఎం కేసీఆర్‌పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రధాని మోడీని కూడా లాగేస్తూ!!

దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిగా అమలు చేస్తున్నాయి. మరోవైపు ప్రజలు కూడా ఇంటికే పరిమితమై కరోనా నిరారణ చర్యల్లో భాగమవుతున్నారు. ఇంకొందరు స్వచ్చందంగా సేవ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు .. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంటికే పరిమితమై సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో పేదలకు అండగా నిలుస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తాజాగా ఓ మీడియా ఛానెల్ ఆయనను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేసింది. లాక్‌డౌన్ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ స్పందనేంటి? అని ప్రశ్నించింది. దీనిపై బదులిచ్చిన ప్రకాష్ రాజ్.. ఇలాంటి సమయంలో తనకైనా, ప్రధాని మోడీకైనా శత్రువు ఒక్కటే అని, దాన్ని నివారించడంలోనే మనమంతా భాగం కావాలే తప్ప ఏ ఒక్కరూ రాజకీయాలు మాట్లాడకూడదంటూ ముక్కుసూటి సమాధానం చెప్పారు. వ్యక్తిగత విభేదాలకు పోకుండా అందరం కలిసి పోరాటం చేయాల్సిన సమయమిది అన్నారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు భేష్ అని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రజలకు ఆయనిచ్చే భరోసా అందరిలో ధైర్యం నింపుతోందని చెప్పారు. కేసీఆర్ వ్యక్తిత్వం గొప్పదని, అలాగే ఆయన మనసు బంగారమని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇకపోతే ప్రధాని మోడీతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని, ఇలాంటి విపత్కర పరితిత్తుల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాని తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పారు. ఈ సంక్షోభం ముగిసిన తర్వాత వాటి వల్ల మంచి జరిగిందా? చెడు జరిగిందా అనే దానిపై ఆలోచించాలి తప్ప ఇప్పుడైతే అందరం సమిష్టిగా కరోనాపై పోరాడాలని ప్రకాష్ రాజ్ అన్నారు. సేవా కార్యక్రమాల విషయంలో తన ఆర్థిక వనరులు క్షీణించినా కూడా వెనక్కితగ్గనని, బ్యాంకులో రుణం తీసుకునైనా కొనసాగిస్తానని ఇప్పటికే ప్రకాష్ రాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో మరోసారి అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ఎంత అప్పు చేసినా ఒక్కసారి షూటింగ్స్ స్టార్ట్ అయితే ఆ డబ్బు సంపాదించుకోవడం సులువే అని ఆయన ఓపెన్‌గా చెప్పేయడం విశేషం. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VzgROo

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...