Thursday 2 April 2020

పార్క్‌లో పాయల్ ఫొటో షూట్.. బాధ్యత ఉండక్కర్లే అంటూ!!

అసలే.. ఈ హీరోయిన్స్‌కి ఆరేసే గుణం తప్పితే.. సాయం చేసే గుణం లేదని నెటిజన్లు ఓ వైపు మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభనతో ఇండస్ట్రీ మొత్తం అతలాకుతలం అయ్యింది. షూటింగ్‌లు లేక.. సినిమాలు విడుదల కాక.. థియేటర్స్ మూత పడటంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. సుమారుగా మూడువేల కోట్లకు పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. దీంతో చాలా మంది కార్మికులు, కళాకారులు తిండిలేక ఇబ్బందులు పడుతుండటంతో టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు ఇతర ప్రముఖులు పెద్ద మనసు చేసుకుని కోట్లరూపాయలను వసూలు చేసి తమ మంచి మనసుని చాటుకున్నారు. అయితే ఇలాంటి ఆపద సమయంలోనూ హీరోయిన్స్ ఎవరికీ సాయం చేయడానికి చేతులు రాలేదు. కోట్లు రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకునే బడా హీరోయిన్స్ సైతం పత్తా లేకుండా పోయారు. అయితే లావణ్య త్రిపాఠి, యాంకర్ రష్మి, ప్రణీత లాంటి చిన్న చిన్న వాళ్లు మాత్రమే తమకు తోచిన సాయం చేశారు. యాంకర్ రష్మి అయితే కొంత మొత్తాన్ని డొనేట్ చేయడమే కాకుండా.. ఓ సేవా సంస్థతో కలిసి మూగజీవాల ఆకలి తీర్చుతున్నారు. సరేసాయం సంగతి పక్కనపెడదాం.. ఎవరి ఇష్టం వాళ్లది.. సాయం చేయాలనే రూల్ ఏమీ లేదు.. పైగా దర్శకుడు దేవకట్ట అన్నట్టు అదేం రౌడీ మామూలు కాదు కాబట్టి వాళ్ల విజ్ఞ‌తకు వదిలేద్దాం. దేశం మొత్తం.. కాదు కాదు ప్రపంచంలో సగం భూభాగం మొత్తం కరోనా భయంతో బెంబేలెత్తిపోతుంది. ఎవరికి వాళ్లే ఇంట్లోనే ఉంటూ భయటకు రాకుండా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ ఓ పార్క్‌లో ఫొటో షూట్‌ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పార్క్‌లో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. బాధ్యత ఉండక్కర్లా!! ఒకవైపు ప్రభుత్వాలు జనం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోవడమే కాకుండా మీ చుట్టూ ఉండే జనాన్ని.. ఈ దేశాన్ని కాపాడండి అంటూ చెప్తూనే ఉన్నా.. ఏ మాత్రం బాధ్యత లేకుండా లాక్ డౌన్ టైంలో పార్కుల్లో తిరుగుతూ ఫొటోలకు పోజులు కొడతావా? అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే ఈ ఫొటో షూట్ ఇప్పుడిది కాదని.. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే తనకు ఇష్టం అని.. ఆ రోజుల్ని మిస్ అయ్యా అంటూ మరో పోస్ట్ పెట్టింది పాయల్. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39Bk0Rd

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...