సమయం తనది కాకపోవచ్చు.. సందర్భం రాకపోవచ్చు.. కాని పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకుని ప్రమోషన్స్ పొందటంలో వర్మకు వర్మే సాటి. ప్రపంచంలో ఎక్కడ ఏమూల చిన్న ఇష్యూ జరిగిన దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో మొదటి నుంచి కూడా తన మార్క్ ట్వీట్లతో వైరల్ అవుతున్నారు. కరోనాపై వర్మ చేసిన ట్వీట్లు ఆలోచింపచేసే విధంగా.. మరికొన్ని ఫన్నీగా.. ఇంకొన్ని కొన్ని వర్గాలలకు ఎప్పటిలాగే మంట పుట్టించే విధంగా ఉన్నారు. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కరోనాపై పాటరాసి ఎవడితోనే ఎందుకు నేనే పాడేస్తే పోలా అనుకున్నాడో ఏమో కాని తన గొంతుకు పనిచెప్పి ఈ పాట ప్రోమో వదిలాడు. పూర్తి పాట వినడానికి సాయంత్రం వరకూ టైం ఉందిలే కాని.. ఈలోపు ఈ ప్రోమో వదులుతున్నా.. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన "కనిపించని పురుగు" అనే పాట ప్రోమో..చెవులకు మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం (ఏప్రిల్ 01) సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను’ అంటూ సోమవారం అర్థరాత్రి ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో పోస్ట్ పెట్టాడు వర్మ. ఇక వర్మ అర్థరాత్రి పూట పెట్టిన పోస్ట్‌లు ఎలాగు ఉంటాయో ఆయన్ని ఫాలో అయ్యేవాళ్లకు దాదాపు ఓ క్లారిటీ ఉంటుందిలే కాని.. తాజాగా వర్మ కరోనాపై పాడిన "కనిపించని పురుగు" పాట చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయేట్టుగానే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. అది పాట లాంటి పాట మాట.. ఇంతకు ముందెప్పుడూ విని ఉండరు అంటే నమ్మాలి. ‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు కరోనా అనే ఒక పురుగు.. నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి.. పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి దాని దాని బలం.. అదే దాని దమ్ము. కంటికి కనిపిస్తే దానమ్మ దాన్ని కత్తితో పొడవచ్చు.. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చొచ్చు.. బట్ ఇట్ ఈజ్ జస్ట్ పురుగు’ అంటూ ఆయనే రాసేసి ఆయనే పాడేశారు. జస్ట్ ఇది ప్రోమో పూర్తి పాట ఈరోజు 5.30 గంటలకు అంటూ ప్రోమో వదిలారు వర్మ. ఇక ఈయన రాసి పాడిన పాటపై జనం ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. దయచేసి నువ్ పాటలు పాడకు వర్మా.. నీ పాట వింటే మాకు కరోనా రాకుండానే పోయేట్టుగానే ఉన్నాం.. మమ్మల్ని ఇలా బతకనియ్యి., ఈ పాట కనుక కరోనా పేషెంట్‌కి వినిపిస్తే వెంటనే కరోనా వైరస్ వెంటనే చచ్చిపోతుంది., కరోనా కనిపించని వైరస్ అయితే నువ్ కనిపించే వైరస్.. ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ తిప్పలు?., నోడౌట్ ఎవరికి మందు దొరక్కపోయిన నువ్ మాత్రం ఓడ్కా ఫుల్ స్టాక్ పెట్టుకున్నట్టు అర్థమైంది., నీ సాంగ్ కంటే ఆ కేఏ పాల్ సాంగ్ బెటర్ సామీ., చాలు వర్మా.. చాలు దయచేసి ఫుల్ సాంగ్ విడుదల చేయకు నీకు దండం పెడతాం., కరోనా కంటే నువ్వంటేనే భయం రా నాయనా., ఏంటేంటి కత్తితో పొడుస్తావా?? బాంబు పెడతావా?? పనిలేని పిచ్చోడు నోటికొచ్చిన పదాలను పాటగా పాడుకున్నట్టుంది.. కరోనా ఉన్నచోట కెమికల్ స్ప్రేలు చేసే బదులు మున్సిపాలిటీ వారు ఈ పాటను మైక్ లో వినిపిస్తే కరోనా ఏం ఖర్మ మనుషులు కూడా పోతారనుకుంటా., కరోనాకి మేం ఈ పాటకు చచ్చేలా ఉన్నాం’ అంటూ నెటిజన్లు వర్మ పాటపై గగ్గోలు పెడుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34569BB
No comments:
Post a Comment