Tuesday, 21 January 2020

MAA: ‘‘చిరంజీవి, రాజశేఖర్‌లను రచ్చబండలో కూర్చోబెట్టాలి’’

‘మా’ అసోసియేషన్‌పై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జర్నలిస్ట్ శ్వేతారెడ్డి. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూల పాల్గొన్న .. ఇండస్ట్రీ పెద్దలపై విరుచుకు పడ్డారు. చిరంజీవి, మోహన్ బాబు, రాజశేఖర్‌లను మరోసారి టార్గెట్ చేశారు. ‘ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) పేరు వినగానే నవ్వొచ్చేస్తోంది. ఒకప్పుడు ‘మా’ అంటే అన్ని వర్గాల ఆర్టిస్ట్‌లు కలిసుండే సంఘం అని ప్రేక్షకుల అభిప్రాయం. రాను రాను ఈ గొడవలకు ఫుల్‌స్టాప్ లేకుండాపోతోంది. ఎన్నికలు జరిగినప్పుడు నరేష్‌ది ఒక గ్యాంగ్, శివాజీ రాజా గ్యాంగ్ ఒకటి, జీవిత-రాజశేఖర్ గ్యాంగ్ ఒకటి భాగాలుగా ఉండేది. ప్రమాణస్వీకారం రోజున కూడా మైక్ ఇవ్వలేదని హేమ, మైక్ లాక్కున్నారని నరేష్‌పై మండిపడ్డారు. అన్నీ బహిరంగంగానే జరిగాయి. అదీకాకుండా ఇటీవల రాజశేఖర్‌కు యాక్సిడెంట్ అయినప్పుడు ‘మా’ అసోసియేషన్‌లో జరుగుతున్న గొడవల వల్లే ఇలా జరిగింది అనడం కరెక్ట్ కాదు’ READ ALSO: ‘ మళ్లీ డైరీ ఆవిష్కరణ రోజు రాజశేఖర్ వాకౌట్ చేయడం, ఆయనపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి క్రమశిక్షణా కమిటీ వేయడం.. ఇవన్నీ చూస్తుంటే అసలు ‘మా’ సభ్యుల మధ్య సఖ్యత లేదని క్లియర్‌గా అర్థమవుతోంది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చెడు చెవిలో చెప్పాలి, మంచి మైక్‌లో చెప్పాలి అని చిరంజీవి చెప్పడం వాట్సాప్‌లో వేరేలా వైరల్ అయింది. ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు మైక్‌లో చెప్పారు, దానిని అమ్మేసేటప్పుడు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేసేశారు అని. ఇక్కడ మ్యాటర్ మంచి, చెడు అని కాదు. ‘మా’లో ఎలాంటి లొసగులు ఉన్నా ఈవెంట్‌కి ముందు లేదా ఈవెంట్ తర్వాత వారిలో వారు చూసుకోవాలి. డైరీ లాంచ్ ఈవెంట్‌లో మోహన్ బాబు, చిరంజీవి ముద్దులు పెట్టుకుని, చిన్నపాటి రొమాన్స్‌ని పండించారు. వీరిద్దరికీ గతంలో విభేదాలు వచ్చాయి’ ‘రాజశేఖర్, చిరంజీవి కుటుంబాల మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ కలిసిపోయాము అన్నారు. ఇక్కడ రాజశేఖర్ గారిని ఓ విషయం అడగాలని అనుకుంటున్నాను. ఏ ఈవెంట్‌కి వెళ్లినా ఆయన భార్య జీవిత సపోర్ట్ లేకుండా రాజశేఖర్ మాట్లాడరు. అలాంటిది మా డైరీ లాంచ్ రోజున జీవితను ఒక్క మాట మాట్లాడనీయకుండా, ఆమె సలహాలు తీసుకోకుండా ఏదేదో మాట్లాడేసి వాకౌట్ ఎందుకు చేశారు? మేమంతా కళామ్మతల్లి ముద్దుబిడ్డలం అని ఎన్నోసార్లు స్టేజ్‌లపై చెప్పినప్పుడు సంఘంలో ఎందుకు ఐకమత్యం లేదు? మన జర్నలిస్ట్‌లను ఉదాహరణగా తీసుకుంటే.. ఓ జర్నలిస్ట్‌కి రోడ్డుపై దెబ్బతగిలినా, లేదా కెమెరామెన్‌పై ఎవరైనా చెయ్యి ఎత్తినా మిగతా జర్నలిస్ట్‌లంతా ఏకమవుతారు. అరే మనోళ్లకి ఏదో కష్టం వచ్చింది అనుకుని అంతా సపోర్ట్ చేయడానికి ఏకతాటిపైకి వస్తారు’ READ ALSO: ‘ ఇదే మాట నేను ఓ సందర్భంలో అన్నాను. ఓసారి జీవితగారు ఓ మాటన్నారు. సినిమా వాళ్లపై ఎవరుపడితే వారు కామెంట్స్ చేస్తున్నారు, మేం అంత చీప్ అయిపోయామా అని. సినిమా వాళ్లు చీప్ అని ఎవరన్నారు? టాలీవుడ్ చిత్రపరిశ్రమ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని బాలీవుడ్‌కు చెందిన కుర్ర హీరోయిన్లు ఇష్టపడుతున్నారు. ‘బాహుబలి’ సినిమాలో వాడిన గ్రాఫిక్స్ చూసి ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తున్నప్పుడు మనం ఈ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుకుంటూ వెళ్లాలా? లేక తగ్గించాలా? ‘మా’ సంఘాన్ని ఎందుకు అందులోని పెద్దలే చేతులారా నాశనం చేసుకుంటున్నారు’ ‘ఒకవేళ గొడవ పడితే పడండి, లేక కలిసిపోవాలనుకుంటే కలిసిపోండి. అంతేకానీ రెండు రోజులు తిట్టుకుని రెండు రోజులు కలిసిపోవడం వంటివి వద్దు. నాకేం అనిపిస్తుందంటే.. చిరంజీవి, రాజశేఖర్, మోహన్ బాబులను రోజాగారి రచ్చబండ కార్యక్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాలి. నేను చివరిగా చెప్పేది ఒక్కటే.. ఏవన్నా సమస్యలు ఉంటే మీడియా ముందు ప్రజల ముందు చూపించకూడదు’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30KiVnG

No comments:

Post a Comment

'If Pawar Tells Me To Jump In A Well...'

'The reason I am not anxious about the opponent facing me in the front (Ajit Pawar) is because of who is standing behind me like a rock ...