Wednesday, 1 January 2020

Chiru 152వ చిత్రం.. లుక్ అదిరింది బాసూ!

బాస్ ఈజ్ బ్యాక్.. ‘సైరా నరసింహారెడ్డి’తో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ తన 152వ సినిమా సెట్‌లో అడుగుపెట్టేశారు. ఈరోజు నుంచి షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సినిమాలో చిరు లుక్ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గళ్లా చొక్కలో చిరు చాలా యంగ్‌గా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు. కొరటాల శివ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో త్రిషను కథానాయికగా ఎంచుకున్నారు. ‘స్టాలిన్’ తర్వాత త్రిష, చిరు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇది. మణిశర్మ మ్యూజిక్ అందిస్తారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తారు. ఆగస్ట్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం కోసం చిరంజీవి బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ సినిమాను కొరటాల శివ..చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నట్టు సమాచారం. చిరంజీవి చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఇలాంటి ఐటెం సాంగ్స్‌కు స్కోప్ లేకుండే. అందుకే ఈ సినిమాలో ఒక మాస్ బీట్ సాంగ్ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సాంగ్‌కు మణిశర్మ మంచి ట్యూన్స్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవితో రెజీనా ఐటెం సాంగ్ చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. READ ALSO: ఇప్పటికే రెజీనా చేతిలో సినిమాలు లేకపోవడంతో ఈ ఐటెం పాటకు ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇక సినిమా కాన్సెప్ట్‌కు వస్తే.. దేవాదాయ శాఖ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్ అట. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QJM2D0

No comments:

Post a Comment

'Kejriwal Is Father Of Freebie Culture'

'He didn't implement good policies for good politics.' from rediff Top Interviews https://ift.tt/TP2BJ1d