Wednesday, 1 January 2020

మహేష్‌, ప్రభాస్‌ల బాటలో విజయ్‌ దేవరకొండ.. త్వరలో కొత్త వ్యాపారం!

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్‌ హీరో . అర్జున్‌ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ యంగ్ హీరో తరువాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న విజయ్‌ వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. తన అభిమానులను ముద్దుగా రౌడీస్‌ అంటూ పిలుచుకునే విజయ్‌ దేవరకొండ అదే పేరుతో క్లాత్స్‌ బ్రాండ్‌ను ప్రారంభించాడు. రౌడీ బ్రాండ్‌పై ఆన్‌లైన్‌లో రెడీమేడ్‌ డ్రెసెస్‌ విక్రయిస్తున్నాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వ్యాపారరంగంలోనూ సక్సెస్‌ అయ్యాడు. తాజాగా మరో వ్యాపరంలోకి అడుగుపెట్టేందుకు రౌడీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. Also Read: త్వరలోనే ఈ యంగ్ హీరో మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ను ప్రారంభించనున్నాడు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. యంగ్ రెబల్‌ స్టార్‌ కూడా తన సొంత ఊరు సూళ్లురుపేటలో వీ ఎపిక్‌ పేరుతో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. అదే బాటలో విజయ్‌ దేవరకొండ కూడా నడిచేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏసియన్‌ గ్రూప్‌తో కలిసి తన సొంత ఊరు మహబూబ్‌నగర్‌లో ఓ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నాడు. ఏవీడీ పేరుతో ఈ మల్టిప్లెక్స్‌ నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్‌ సినిమాలో నటించనున్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39zK3JN

No comments:

Post a Comment

'Kejriwal Is Father Of Freebie Culture'

'He didn't implement good policies for good politics.' from rediff Top Interviews https://ift.tt/TP2BJ1d