Wednesday 4 September 2019

Tollywood Casting Couch: వాడుకుని వదిలేశారు.. ఆర్టిస్ట్ సునీత నిరసన, అరెస్ట్

టాలీవుడ్ మరో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో అవకాశం ఇస్తాం అని ఉపయోగించుకుని అవసరం తీరాక ముఖం చాటేయడంతో ఆందోళనకు దిగింది జూనియర్ ఆర్టిస్ట్ . గత ఎన్నికల్లో జనసేన పార్టీకోసం పనిచేసిన తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానన్నారని ఇప్పుడు మోసం చేశారంటూ నిరసనకు దిగింది సునీత. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆమె గొలుసులతో బంధించుకుని హల్ చల్ చేసింది. బుధవారం నాడు రాత్రి అంతా ఫిల్మ్ ఛాంబర్‌లోనే తనను తాను నిర్భందించుకున్నారు. జనసేన పార్టీకి పనిచేస్తే.. గీతా ఆర్ట్స్‌లో అవకాశాలు ఇస్తామన్నారని.. ఇందుకోసం తన సొంత ఖర్చులతో జనసేన పార్టీకి పనిచేశానన్నారు. తీరా ఎన్నికలు ముగిసిన తరువాత గీతా ఆర్ట్స్‌కు చెందని నిర్మాత బన్నీ వాసుని కలిస్తే.. ఆయన అసలు పట్టించుకోవడం లేదని వారి తీరుకు నిరసనగా తనను తాను బంధించుకున్నానన్నారు సునీత. దీనిపై గీతా ఆర్ట్స్, పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు సునీత. అయితే దీనిపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం తెల్లవారు జామున పోలీసులు ఫిల్మ్ ఛాంబర్ తలుపులను పగులగొట్టి.. బోయ సునీతను అదుపులోకి తీసుకున్నారు. కాగా సునీత బోయ పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తుందని గతంలో కూడా ఆమె ఇలాంటికే చేసిందంటూ ఆమె ఆరోపణలను కొట్టిపరేస్తున్నారు. ఇంతకీ ఎవరీ సునీత బోయ అంటే.. చిన్నాచితకా సినిమాల్లో నటించి ఆమె టాలీవుడ్ ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం చేకపోయినప్పటికీ.. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని అప్పట్లో మీడియాకి ఎక్కింది. తన ఫ్లాట్‌కి పిలిపించుకునే వాడని.. డబ్బులు పేటీఎం చేసేవాడంటూ టీవీ9 చర్చతో హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి యాక్టివ్ మెంబర్‌గా పనిచేసింది. అప్పట్లో ఆమెపై దాడి కూడా జరగడంతో వార్తల్లోకి వచ్చింది. మొత్తానికి ఫిల్మ్ ఛాంబర్ వద్ద జూనియర్ ఆర్టిస్టుల నిరసనలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అప్పట్లో శ్రీరెడ్డి.. ఇదే ప్లేస్‌లో అర్ధనగ్న ప్రదర్శనతో ఇండస్ట్రీని హీటెక్కించిన విషయం తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NZaArV

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...