Wednesday 4 September 2019

Madame Tussauds: శ్రీదేవి మైనపు బొమ్మ.. కన్నీరుమున్నీరైన బోనీ

అలనాటి అతిలోక సుందరి మైనపు విగ్రహాన్ని సింగపూర్‌కు చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం రూపొందించింది. శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషి కపూర్‌ల సమక్షంలో బొమ్మను ఈరోజు ఆవిష్కరించారు. శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి’ పాటలోని ఓ స్టిల్‌ను బొమ్మగా మలిచారు. అయితే శ్రీదేవి ముక్కు వద్ద ఏదో లోపం కనిపిస్తోంది. ఆమె ముక్కు కాస్త దగ్గరగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ముక్కును పోలి ఉంది. బతికున్న సెలబ్రిటీల మైనపు విగ్రహాలనే సరిగ్గా రూపొందించలేకపోతోంది మేడమ్ టుస్సాడ్స్. ఇక శ్రీదేవి లేకుండా ఆమె మైనపు విగ్రహాన్ని ఎలా రూపొందించాలనుకున్నారో ఏమో. ఒకవేళ రూపొందించాలనుకున్నా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు బోనీ కపూర్ కన్నీరుమున్నీరయ్యారు. శ్రీదేవికి నివాళిగా మ్యూజియం నిర్వాహకులు అభిమానులు రాసిన సందేశాలను విగ్రహం వెనకున్న బోర్డుపై అతికించారు. వాటిపై బోనీ కూడ సంతకం చేశారు. ఓ లెజెండరీ నటి మైనపు విగ్రహాన్ని ఆమె కుటుంబీకుల అనుమతితో రూపొందించినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నామని యూకేకు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ లిజ్జీ పార్కిన్సన్ తెలిపారు. శ్రీదేవి మైనపు బొమ్మకు వేసిన దుస్తులు, చెవి రింగులు అన్నీ త్రీడీ ప్రింటెడ్ ద్వారా రూపొందించినవని తెలిపారు. మేడమ్ టుస్సాడ్స్‌లో శ్రీదేవి లాంటి ఐకాన్ విగ్రహం లేకపోతే నిండుతనం కనిపించదని మేడమ్ టుస్సాడ్స్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు. ఆమె మృతిని ఇప్పటికీ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చివరిగా ‘మామ్’ చిత్రంలో నటించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ఇప్పుడు బోనీ ‘మిస్టర్ ఇండియా’ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు. ‘మిస్టర్ ఇండియా’లో ఎవరైతే నటించారో వారందరినీ సీక్వెల్‌లో చూపించాలనుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZETBRP

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...