Sunday, 1 September 2019

Prabhas సినిమా సాంకేతిక అద్భుతం.. సాహోపై కేటీఆర్ ప్రశంసలు

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘సాహో’కు జై కొట్టారు. ఈ సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. చిత్ర నిర్మాత సుదీప్, హీరో ప్రభాస్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సినిమా భారతీయ సినిమా నిర్మాతలు, దర్శకులకు ఓ కొత్త ప్రమాణాలను నిర్దేశించిందన్నారు. అడివి శేష్ నటించిన ‘ఎవరు’ సినిమాపై కూడా కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. ఈ మూవీ స్క్రీన్ ప్లే‌ను మెచ్చుకున్న టీఆర్ఎస్ నేత.. హీరో అడివి శేష్, హీరోయిన్ రెజీనాలు అద్భుత నటన కనబరిచారన్నారని ఆదివారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే కేటీఆర్ వారాంతాల్లో లేదా వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు చూసి సేదతీరుతుంటారు. సినిమా నచ్చితే.. చిత్ర యూనిట్‌‌ను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్లు చేస్తుంటారు. గతంలో రంగస్థలం, తొలి ప్రేమ, భరత్ అనే నేను లాంటి చిత్రాలపై కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీతోపాటు పలు భారతీయ భాషల్ల విడుదలైన సంగతి తెలిసిందే. ఆగష్టు 30న విడుదలైన చిత్రం మిక్స్‌డ్ రియాక్షన్ సొంతం చేసుకుంది. టాక్ ఎలాగున్నప్పటికీ.. ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. తొలి రోజే ఈ సినిమా రూ.130 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ప్రభాస్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LlMmoB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....