Sunday, 1 September 2019

Pawan Kalyanకి లోకేష్, చంద్రబాబు బర్త్ డే విష్.. ఇంట్రస్టింగూ

‘పార్టీలు వేరైనా సిద్ధాంతాలు ఒక్కటే.. దారులు వేరైనా గమ్యం మాత్రం ప్రజాసేవే’ అంటూ అడుగులేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులు. నేడు జనసేన అధినేత 48వ జన్మదినోత్సవ సందర్భంగా ట్విట్టర్ ద్వారా విషెష్ అందించారు మాజీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు లోకేష్ బాబు. పవన్ కళ్యాణ్‌కి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని కోరుతూ ట్వీట్ చేశారు లోకేష్ బాబు. ‘జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉన్నతమైన భావాలతో ప్రజాక్షేత్రంలో ప్రయాణిస్తున్న మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. లోకేష్ బాబుతో పాటు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకులు నారా పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించి, విశిష్ట వ్యక్తిత్వంతో, ప్రజల పక్షాన నిలిచి సేవలందిస్తోన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు శతాయుష్కులై, సంపూర్ణ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2lRO08s

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....