Sunday, 1 September 2019

Pawan Birthday: పవన్‌కి శుభాకాంక్షల వెల్లువ.. టాలీవుడ్ పిలుస్తోంది మళ్లీ రావా!

సమాజం అంటే అమితమైన ప్రేమ అంతకు మించి పిచ్చి అందుకోసం తన ఆలోచల్ని ఇజంగా మార్చిన భావకుడతడు. అభిమానం అనే పదాన్ని భక్తి స్థాయి తీసుకువెళ్లిన ట్రెండ్ సెట్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం నేడు. ఈ సందర్భగా అభిమానులు అసలైన పండుగను నిర్వహించుకుంటున్నారు. వినాయక చవితి కూడా ఇదే రోజు కలిసి రావడంతో ఫ్యాన్స్ ఆనందంతో పొంగిపోతున్నారు. పవర్ స్టార్ నామస్మరణతో సోషల్ మీడియా హీటెక్కుతోంది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు వెల్లువలా వస్తున్నాయి. నెల రోజుల ముందు నుండే పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం కావడంతో పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిన పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే ట్వీట్లు ఉవ్వెత్తున వస్తున్నాయి. ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. మెగా హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్‌లతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. ఆ ట్వీట్స్ చూద్దాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2lQiW9f

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....