Saturday, 21 September 2019

Gaddalakonda Ganesh: కొత్త దర్శకులకు హరీష్ శంకర్ సలహా

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్‌’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై మంచి టాక్ అందుకుంటోంది. సినిమా సూపర్ హిట్ అంటూ అభిమానులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ‘గద్దలకొండ గణేశ్’ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో హరీష్ శంకర్ మాట్లాడారు. ఇండస్ట్రీకి కోటి ఆశలతో వస్తున్న కొత్త దర్శకులకు ఓ సలహా ఇచ్చారు. ‘మా ‘గద్దలకొండ గణేష్‌’ సినిమా విడుదలయినప్పటి నుంచి అందరి నోటా సూపర్‌హిట్‌ అన్న మాటే వినిపిస్తోంది. వరుణ్‌తేజ్‌ వన్‌మాన్‌షో అని అంటున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్రిసియేషన్‌ వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవిగారు ఫోన్‌ చేయడంతో మాకు ఇంకాఎనర్జీ వచ్చింది. తరువాత అల్లుఅర్జున్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కొంతమంది అయితే హరీష్‌.. నీ కెరీర్‌‌లోనే బెస్ట్ సినిమా ఇది అన్నారు. బహుశా ఫస్ట్‌ టైం నా సినిమాలో ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. అలాగే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వరుణ్‌ రెండు షేడ్స్‌లో అద్భుతంగా నటించారు. సినిమాలో వరుణ్‌ కనిపించే హీరో అయితే కనపడని హీరో సినిమా. సినిమానే అతన్ని మార్చింది. మొన్న సాయంత్రం వరకు నా సినిమా ఏంటో ఈ ప్రపంచానికి తెలీదు. సినిమా చూసిన వారు నా సినిమానే ప్రపంచం అంటున్నారు. టైటిల్ మార్పు వివాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నిన్న మాకు జరిగిన ఇబ్బంది కలగకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేసేవాళ్ళం. ఈ వివాదంలో ఎవరు ఓడిపోయారో నాకు తెలీదు కానీ సినిమా మాత్రం గెలిచింది. ఈ సందర్భంగా కొత్త దర్శకులకు నేను ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మా సినిమాలోని ఓ సన్నివేశంలో కోరుకున్న హీరోతో సినిమా చేయలేకపోయినందుకు దర్శకుడు సినిమా నుంచి తప్పుకొంటాడు. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుంటాయి. ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకుని ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక్కోసారి మనకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూసి వదిలేసుకుంటూ ఉంటాం. ఆ అవకాశాలు మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అని చూడకుండా వచ్చినదాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోవాలి. మనకు నచ్చిన పనిని వేరే పని కోసం వదులకుంటే దాన్ని కాంప్రమైజింగ్ అంటారు. అదే చిన్న మార్పులు చేసుకుని ఆ పనిని పూర్తి చేయగలిగితే దానిని అడ్జస్టింగ్ అంటారు’ అని వెల్లడించారు. వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ... ‘నిన్న రాత్రి మా ఎవ్వరికి నిదరపట్టలేదు. ఎప్పుడైతే ప్రీమియర్‌ షోస్‌ పడ్డాయో అప్పటినుండి పాజిటివ్‌ టాక్‌తో మాకు నిద్రపట్టకుండా చేశారు. మార్నింగ్‌ చిరంజీవి గారు, అల్లు అరవింద్‌ గారు ఫోన్‌ చేసి అభినందించారు. అప్పటి నుండి కంటిన్యూయస్‌గా కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇది నా ఒక్కడి విజయం కాదు మా టీం అందరి విజయం. సినిమా స్టార్టింగ్‌ నుండి సపోర్ట్‌ చేసి, ఇప్పుడు పాజిటివ్‌ రివ్యూస్‌ ఇచ్చిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30pZZgh

No comments:

Post a Comment

'Aamir And I Are Still Very Close'

'After being married for almost 18 years, and since there was never any rancour between us, we are still very close, as parents of Azad,...