Sunday 22 September 2019

రాజమౌళి ‘బాహుబలి’ తీసుండకపోతే ‘సైరా’ వచ్చుండేది కాదు: చిరంజీవి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సినిమాగా చేయడానికి శ్రీకారం చుట్టుంది, పరోక్షంగా ప్రోత్సహించింది దర్శకుడు రాజమౌళి అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన గనుక ‘బాహుబలి’ తీసుండకపోతే ఈరోజున ‘సైరా నరసింహారెడ్డి’ వచ్చి ఉండేది కాదని చిరంజీవి చెప్పారు. మన తెలుగు సినిమాకి భారతదేశ వ్యాప్తంగా ఒకదారిని రాజమౌళి నిర్మించేశారని కొనియాడారు. ఆదివారం రాత్రి జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సైరా’ను ఇంత ఎక్కువ బడ్జెట్‌తో ధైర్యంగా నిర్మించామంటే దానికి కారణం రాజమౌళి అన్నారు. ‘‘12 సంవత్సరాల క్రితం పరుచూరి బ్రదర్స్‌ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆ పాత్ర నాకు చాలా బాగుంటుందని చెప్పారు. ఆ పాత్రలో ఎన్నో డైమెన్సన్స్ ఉన్నాయి, ఒక చక్కటి పరిపూర్ణమైన సినిమాకి ఆ కథ చాలా బాగుంటందని చెప్పారు. సినిమా సక్సెస్ విషయం పక్కనబెడితే ఒక యోధుడు గురించి తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశ ప్రజలకు తెలియజెప్పే గొప్ప పాత్ర అవుతుందని చెప్పారు. అప్పటినుంచి నన్ను అడుగుతూనే ఉన్నారు. Also Read: ఆ రెండు మూడు జిల్లాల వాళ్లకు తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. చిన్న చిన్న పుస్తకాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు ఉన్నాయి తప్ప ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కానీ, కథ విన్న తర్వాత ఒక గొప్ప యోధుడు, తెరమరుగైన హీరో, అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగల్‌పాండే గురించి తెలుసు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ గురించి తెలుసు. అలాగే భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, గాంధీ ఇలా ఎంతో మంది త్యాగమూర్తుల గురించి తెలుసుకున్నాం. కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి స్టోరీ తెరమరుగు అయిపోకూడదు. ఈయన మన తెలుగు వ్యక్తి, ఈయన గురించి ప్రపంచానికి చెప్పాలి అని మైండ్‌లో బలంగా ఉండిపోయింది. ఈ సినిమా చేయాలని పరిచూరి బ్రదర్స్ గట్టిగా సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నంచారో.. యస్ చేయాలి అని నాలో కూడా బలమైన కోరిక ఏర్పడిపోయింది. దీనికోసమే కదా ఇన్నేళ్లుగా వేచిచూస్తున్నాను అనిపించింది. అయితే, ఈ కథను తెరకెక్కించాలంటే మా ముందు ఉన్న పెద్ద సవాల్‌ బడ్జెట్‌. పది పదిహేనేళ్ల క్రితం నా మీద రూ.30 నుంచి రూ.40 కోట్లు వెచ్చించి సినిమా తీసే రోజుల్లో ఇది రూ.60, రూ.70 కోట్ల పైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు. మనం చేయమని అడగలేం. నష్టపోయే పరిస్థితి. ఏం చేయాలి? చూద్దాం చేద్దాం అంటూనే కాలం గడిచిపోయింది. అయితే, ఈరోజున మళ్లీ 151వ సినిమాగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అనే మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన గనుక ‘బాహుబలి’ తీసుండకపోతే ఈరోజున ఈ ‘సైరా నరసింహారెడ్డి’ వచ్చి ఉండేది కాదు. మన తెలుగు సినిమాకి ఆయన భారతదేశ వ్యాప్తంగా ఒకదారిని నిర్మించేశారు. శభాష్.. ‘బాహుబలి’ లాంటి ఒక గొప్ప సినిమాను ఆయన చేసి, ఇన్ని వందల కోట్ల రూపాయలు మనం ఖర్చుపెట్టినా సరే అంతకంత రాబట్టుకోవచ్చు, నిర్మాతకు నష్టం ఉండదు అని ఒకరకమైన భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి. ఈ విషయం సభాముఖంగా చెప్పాలనే ఇంతకాలం ఆయనకు చెప్పలేదు. కానీ, ఇప్పుడు చెబుతున్నాను.. హ్యాట్సాఫ్ టు రాజమౌళి’’ అని చిరంజీవి సుధీర్ఘంగా మాట్లాడారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2M7Iqs7

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...