Sunday, 22 September 2019

టెక్నాలజీ పేరుతో నన్ను నానా హింసలు పెట్టారు: చిరంజీవి

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి దర్శకుడిగా సురేందర్ రెడ్డిని అనుకొని ఆ మాట అతనికి చెప్పగానే ఎగిరి గంతేస్తాడని తాను అనుకున్నానని.. కానీ, నాకు కొంత సమయం కావాలి సార్ అని ఆయన అడగడం తనను నిరుత్సాహపరిచిందని చిరంజీవి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కించిన తీరును ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో వివరించిన చిరంజీవి.. నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంత భారీ బడ్జెన్ సినిమాతో వేరే నిర్మాతను రిస్క్‌లో పెట్టేకన్నా ఆ రిస్క్ ఏదో మనమే చేద్దాం డాడీ అని రామ్ చరణ్ చెప్పగానే తాను ‘సై’ అన్నానని చిరంజీవి వెల్లడించారు. ‘‘ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయాలా? అనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్‌ నన్ను దర్శకత్వం చేయమన్నారు. దర్శకుడు అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ జాబ్. యాక్టింగ్ చేస్తూ దర్శకత్వానికి మనం న్యాయం చేయలేం. నేను చేయలేక కాదు.. ఏదో ఒకటి వదిలేయాలి. దేన్ని వదిలేయమంటారు? అనడిగాను. అమ్మమ్మో వద్దు డైరెక్షన్ వేరొకరిని పెట్టుకుందా. ఈ క్యారెక్టర్‌లో మిమ్మల్నే ఊహించుకున్నాం, మీరే చేయాలి అన్నారు. ఇక డైరెక్టర్ ఎవరు అని అనుకుంటున్న సమయంలో చరణ్‌ సురేందర్‌రెడ్డి పేరు చెప్పాడు. ‘ధృవ’ సినిమా నాకు చాలా బాగా నచ్చిందిరా.. కష్టపడతాడు, ఈ సినిమాలో ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, కొత్తగా ఆలోచన చేయాలి అన్నాను. సమర్థత, సామర్థ్యం ఉన్న దర్శకుడు డాడీ చేస్తాడు అన్నాడు. నేను ఓకే చెప్పాను. ఆ మాట చెప్పగానే సురేందర్ రెడ్డి ఎగిరి గంతేస్తాడు అనుకున్నాను. క్వైట్‌గా, కంపోజ్‌డ్‌గా ఉండి.. నాకు కొంచెం టైమ్ కావాలి సార్ అన్నాడు. Also Read: అది మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది. ఇదేంటిరా బాబూ అనిపించింది. వారం రోజుల తర్వాత సురేందర్ రెడ్డి వచ్చి ప్రిపేర్ అయ్యాను సార్ చేస్తాను అన్నాడు. ముందు ఎందుకు వద్దాన్నావ్ అని అడిగితే.. ఏం లేదు సార్ ఒకవైపు చిరంజీవి, మరోవైపు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ.. నేను చేయగలనా, ఈ సినిమాకు న్యాయం చేయగలనా అని నన్ను నేను రెడీ చేసుకోవడానికి పట్టిన సమయం సార్ ఇది అన్నాడు. ఇప్పుడు నేను రెడీ సార్ అని ఆ రోజు నుంచి నెలరోజులపాటు ఆ ప్రాంతానికి వెళ్లి కొంతమంది చరిత్రకారులను, అక్కడున్న కథకుల్ని కలిసి అక్కడి నుంచి వచ్చి గోవా వెళ్లిపోయి మూడు వారాల్లో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. అదే కథను చక్కటి కథనంతో, కథాగమనంతో, ఎమోషన్స్‌తో యథార్థ గాధను ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ చేసి చాలా చక్కగా మలిచిన సురేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. హ్యాట్సాఫ్. మా అసోసియేట్స్ అంతా కథ చాలా బాగుంది అన్నారు. ఆ ఉత్సాహంతో సురేందర్ రెడ్డి షూటింగ్ ప్రారంభించాడు. అంతా బాగుంది, అన్నీ సిద్ధమయ్యాయి కానీ, నాకే చాలా భయం వేసింది. ఎందుకంటే, సినిమా మొత్తం గుర్రాలపై, కత్తియుద్ధాలు చేస్తూ ఉండాలి. డూప్‌తో చేయడం నాకు ఇష్టం ఉండదు. డూప్ చేస్తే నా అభిమానులు యాక్సెప్ట్ చేయలేరు. అవన్నీ ఊహించుకుంటే చాలా కష్టం అనిపించింది. వాళ్లు మీకేం కష్టం లేకుండా తీస్తాం సార్, టెక్నాలజీ వచ్చింది అన్నారు. కానీ, టెక్నాలజీ పేరుచెప్పి నన్ను నానా హింసలు పెట్టి నా నుంచి యాక్షన్ సీక్వెన్స్ రాబట్టారు. Also Read: టెక్నాలజీ ఏమో కానీ.. ఒక్కసారి మేకప్ వేసుకుని కత్తి, డాలు పట్టుకుని గుర్రం ఎక్కానంటే గనుక నా ఒళ్లు మరిచిపోతాను, నా వయసు మరిచిపోతాను, నాకు గుర్తొచ్చేది నా అభిమానులు మాత్రమే. అక్కడ గుర్తొచ్చేది నా ఇమేజ్ మాత్రమే. 25 సంవత్సరాల క్రితం ఏ జోష్‌తో అయితే చేశానో అదే జోష్ ఈ బాడీని ఆవహిస్తూ ఉంటుంది’’ అని తన అనుభవాలను చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30F3Dim

No comments:

Post a Comment

'Investments Of Over Rs 4 Trn To Create 100,000 Jobs'

'The size of the investments is important, but equally crucial is the number of jobs that these proposals create.' from rediff Top...