'గజినీ' సినిమాతో భారీ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయిపోయిన సూర్య అప్పట్లో వరుసగా డిఫరెంట్ అండ్ హిట్ సినిమాస్‌తో ఇక్కడ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒకానొక స్టేజ్‌లో అయితే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకంటే సూర్య నటించిన డబ్బింగ్ బొమ్మలకే ఎక్కువ థియేటర్స్ సైతం దక్కేవి. '7th సెన్స్' సినిమా రిలీజ్ టైమ్‌లో ఈ ఇష్యూపై పెద్ద గొడవ కూడా నడించింది. ఆ సినిమాకి, ఆ తరువాత సూర్య స్వయంగా నిర్మించిన 24 సినిమాకి కూడా ఇంచుమించు తమిళ్ వెర్షన్‌తో సమానంగా తెలుగు వసూళ్లు వచ్చాయి. Also Read: తెలుగులో అంత క్రేజ్ ఉన్న సూర్య రాను రాను స్క్రిప్ట్స్ ఎంపికలో చాలా పొరపాట్లు చేసాడు. దాంతో ఊహించని డిజాస్టర్స్ పలకరించాయి. అప్పుడయినా కూడా మేలుకుని కంటెంట్ ఉన్న డైరెక్టర్స్‌తో ష్యూర్‌షాట్ హిట్ లాంటి కథని సెలెక్ట్ చేసుకుని సెట్‌రైట్ అవ్వకుండా ప్రయోగాత్మక సినిమాలే చేసుకుంటూ వెళుతున్నాడు. దాంతో రాను రాను తెలుగు ప్రేక్షకులు సూర్య సినిమా రిలీజ్ అవుతుంది అoటే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకా ఒకటో, రెండో ఫ్లాప్స్ వస్తే అసలు సూర్య అనే హీరో కూడా ఉన్నాడు అనే సంగతి కూడా మర్చిపోతారు. ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన 'బందోబస్త్' సినిమాకి వస్తున్న కలెక్షన్స్ పరిస్థితి అర్ధమవుతుంది. Also Read: మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం కోటి రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా రాబట్టలేకపోయింది 'బందోబస్త్'. 'కాప్పాన్' పేరుతో తెరకెక్కిన ఈ తమిళ సినిమా అక్కడ కూడా ప్లాప్‌టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పర్లేదు అనేలా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఈ రేంజ్‌లో ఉన్నాయి కలెక్షన్స్. రెండో రోజు అయితే ఇక చెప్పుకోవక్కర్లేదు. తెలుగులో 9 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది 'బందోబస్త్'. కానీ కలెక్షన్స్ మాత్రం దానికి దగ్గరగా వెళ్లే సూచనలు అస్సలు కనిపించట్లేదు. Also Read: పక్కన 'గద్దలకొండ గణేష్'కి ఉన్న హైప్‌తో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కుమ్మేస్తుంటే, ఒక మోస్తరు కంటెంట్ ఉన్న 'బందోబస్త్' మాత్రం వెలవెల బోతుంది. సూర్య ముందు చెప్పినట్టు వెంకటేష్‌తో కలిసి మల్టీస్టారర్ కానీ, త్రివిక్రమ్‌తో కలిసి ఒక ఎంటర్టైనర్ కానీ చేస్తే తప్ప అతను ఫ్లాప్స్ నుండి బయటపడేలా కనిపించట్లేదు. మరి సూర్యను ఎవరు కాపాడతారో, ఫ్లాప్ నుండి కాపాడి హిట్ ఇస్తారో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2LFm9Ti
No comments:
Post a Comment