Wednesday, 9 March 2022

Radhe Shyam : వదిన అంటూ అసలు కథ చెప్పేసింది.. ప్రభాస్ పెళ్లిపై సోదరి కామెంట్లు

ప్ర‌భాస్‌, అనుష్క పెళ్లి మీద ఎన్ని వేల వార్తలు వచ్చాయో చెప్పడం కష్టం అవుతుంది. పెళ్లి రూమర్లపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి కూతురు.. అంటూ పిచ్చి పిచ్చి వార్తలన్నీ కనిపిస్తుంటాయి. ఇక తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు భార్య శ్యామల దేవీ స్పందించడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చేసింది. ప్రభాస్ పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌కి మ‌న సంస్కృతి సంప్ర‌దాయాలంటే ఎంతో గౌర‌వం ఉంది. మ‌హిళంటే గౌర‌వం ఉంది. కుటుంబానికి.. ఇంటి పెద్ద‌ల‌కు గౌర‌వం ఇస్తారు. ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఆయ‌న బిజీగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు పెద్ద కూతురు స్పందించింది. నిర్మాతగా తన అనుభవాన్ని చెబుతూ పర్సనల్ విషయాలను పంచుకుంది. సాహో సినిమా కూడా ఒక నెల పనిచేశాను అని తెలిపింది. విదేశాల్లో ప్రొడక్షన్ కోర్సులను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. నిర్మాతగా తన మొదటి సినిమాను చూసేందుకు నాలుగేళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆతిథ్యం ఇవ్వడం అనేది తమ బ్లడ్డులోనే ఉందని ప్రసీద తెలిపింది. తాను కూడా తన ఫ్రెండ్స్ అందరికీ వండి పెడతాను అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రభాస్ పెళ్లిపై ప్రసీద స్పందించింది. వదినని తీసుకురమ్మని ప్రభాస్ అన్నయ్యకి ఎప్పుడూ చెప్పలేదు..ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే హ్యాపీ అని ప్రసీద చెప్పుకొచ్చింది. ప్రభాస్‌కు వంటలు చేయడం రాదని ప్రసీద తెలిపింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/hrpeunJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....