Wednesday, 9 March 2022

నువ్వు నా డార్లింగ్, నీ కోసం ఏదైనా చేస్తా.. రాజమౌళి కామెంట్స్ వైరల్

టాలీవుడ్ దర్శకుల పరంగా చూస్తే క్రేజ్ ఏంటనేది మనందరికీ తెలుసు. ఆయన సినిమా అంటే అన్ని వర్గాల ఆడియన్స్‌లో అదో క్యూరియాసిటీ. ప్రస్తుతం ఆయన రూపొందించిన భారీ సినిమా RRR విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి గ్రాండ్‌గా ప్రమోషన్స్ చేయాలని స్కెచ్చేసిన జక్కన్న.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధే శ్యామ్ ప్రమోషన్స్‌లో భాగమవుతున్నారు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించిన రాజమౌళి, తన వంతుగా ప్రమోట్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌తో కలిసి రాజమౌళి ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వూలో ప్రభాస్- జక్కన్న నడుమ జరిగిన సంభాషణ, ప్రభాస్‌పై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నిజానికి వీళ్ళిద్దరిదీ బాహుబలి ఫ్రెండ్‌షిప్, పైగా ఒకరంటే ఇంకొకరికి చాలా ఇష్టం కూడా. రికార్డులు తిరగరాసిన కాంబో కూడా ఇదే. అయితే జక్కన్నతో ఉన్న సాన్నిహిత్యంతో ప్రభాస్ నేరుగా ఆయన్ను ఓ ప్రశ్న అడిగారు. రాధేశ్యామ్ సినిమాను మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారనే ప్రశ్న వేశారు. వెంటనే దీనిపై రాజమౌళి రియాక్ట్ అవుతూ.. నువ్వు నా డార్లింగ్, నీకోసం ఏదైనా చేస్తానని అనేశారు. ఈ సమాధానంతో ప్రభాస్- రాజమౌళి బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది మరోసారి స్పష్టమైంది. జక్కన్న చెప్పిన ఈ ఆన్సర్ రెబల్ స్టార్ అభిమానులను ఫిదా చేయడంతో పాటు రాజమౌళిపై ఉన్న ఇష్టాన్ని రెట్టింపు చేసింది. రాధే శ్యామ్ సినిమా విషయానికొస్తే.. పాన్‌ ఇండియా మూవీగా భారీ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/lxZKun2

No comments:

Post a Comment

Iran's Consul-General: 'We Hold The Upper Hand'

'Despite the large number of missiles and drones we have already launched, we still possess reserves and missile cities whose doors have...