Saturday, 24 July 2021

Raviteja: ఖిలాడి ఆన్ సెట్స్.. స్మార్ట్‌‌గా దూసుకెళ్తున్న మాస్ మహారాజ్

మాస్ మహారాజ్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ''. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో ఒక్కొక్కటిగా ఆగిపోయిన సినిమాలన్నీ సెట్స్ మీదకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రయ్ రయ్ అంటూ యమ స్మార్ట్‌‌గా కెమెరా ముందుకు రాబోతున్నాడు 'ఖిలాడి' రవితేజ. జులై 26వ తేదీ నుంచి 'ఖిలాడి' మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మేరకు శనివారం రోజు కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు డైరెక్టర్. ఇందులో స్పోర్ట్స్‌ బైక్‌పై స్టైలిష్‌గా దూసుకుపోతూ కనిపించారు రవితేజ. దర్శకత్వంలో యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌లైన్‌. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతంగా వ్యవహరిస్తున్నారు. కరోనా రెండో దశకి ముందే ఇటలీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది. అతిత్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనుంది చిత్రయూనిట్. మాస్ మహారాజ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుండటంతో ఈ మూవీపై రవితేజ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wYyN49

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....