Friday, 23 July 2021

భర్తను మింగిన శ్రియ.. చిలిపి పనులతో హీరోయిన్ రచ్చ.. వీడియో వైరల్

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నా పెద్దా, సీనియర్ జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసనా నటించేసింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరి పక్కనా హీరోయిన్‌గా చేశారు. అలాంటి శ్రియా ఇప్పుడు తెరకు కాస్త దూరంగా ఉంటున్నారు. పాత్రలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. అయితే అభిమానులను మాత్రం నిత్యం పలకరిస్తూనే ఉంటారు. వివాహాం తరువాత శ్రియా సోషల్ మీడియాలో మరింత ఎక్కువ సందడి చేస్తున్నారు. భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి రష్యాలో శ్రియా చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ ఇద్దరి సరసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య సముద్రం మధ్యలో ఈ ఇద్దరి సరసాలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఏకంగా శ్రియా ఎద అందాలపైనే ఆండ్రూ గురి పెట్టినట్టున్నారు. ఎద అందాలపై ముద్దులు పెట్టిన వీడియో నెట్టింట్లో ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. అలా ఈ జోడీ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లోఉంది. రోజూ షికార్లకు వెళ్తున్నట్టున్నారు. నిన్న సాయంత్రం అలా బీచ్ ఒడ్డున కూర్చుని బికినీ షో అంటూ నవ్వుకున్నారు. ఆండ్రూ వేసిన కుప్పి గంతులకు శ్రియా పడి పడి నవ్వారు. అయితే తాజాగా ఆండ్రూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో తమ ఫోటోగ్రఫీ టాలెంట్‌ను చూపించారు. శ్రియ కెమెరాకు దగ్గరగా ఉంటే ఆండ్రూ మాత్రం కాస్త దూరంలో.. శ్రియ నెత్తి మీదున్నట్టుగా, నెత్తి మీద డ్యాన్స్ చేసినట్టు, నాలుక మీద కూర్చున్నట్టు ఉన్నారు. ఇక తన భర్తను తాను మింగినట్టు ఇందులో చూపించారు. మొత్తానికి ఈ భార్యాభర్తలు చేసే అల్లరి మాత్రం నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. ఇప్పుడు ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. శ్రియ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V93tlZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....