Sunday, 25 July 2021

క్రేజీ అంకుల్స్‌తో శ్రీముఖి పార్టీ.. స్వీటీ స్వీటీ అంటూ రాములమ్మతో రచ్చ రచ్చ

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్యంత క్రేజ్ ఉన్న యాంకర్ ఎవరంటే ముందుగా అందరు పేరే చెబుతారు. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తుంటుంది శ్రీముఖి. గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఈమె ఊహించినంత గుర్తింపు రాలేదు. దీంతో బుల్లితెర అద్భుత ప్రదర్శన చేస్తూ.. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకుంది. దీంతో ఇప్పుడు పాపులారిటీ వచ్చిన తర్వాత ఈ భామకు సినిమా అవకాశాలు క్యూకడుతున్నాయి. తాజాగా ఈ భామ ‘’ అనే సినిమాలో నటిస్తోంది. సత్తి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో , సింగర్ మనో, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటకు రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక గానం చేసింది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఫాస్ట్ బీట్‌తో సాగే ఈ పాటలో శ్రీముఖి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఇక సినిమా విషయానికొస్తే.. ఇందులో శ్రీముఖి కాస్త స్పైసీగా ఉండే పాత్రలో నటిస్తోంది. ఆమెను పడేయటానికి ప్రయత్నించే ముగ్గురు అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి కనిపించనున్నారు. మరి ఈ అందాల భామను పడేయటానికి ఆ ముగ్గురు అంకుల్స్ చేసే ప్రయత్నాలు ఏంటీ అనేదే సినిమా ప్రధాన అంశంగా ఉండనుంది. ఇక ఈ సినిమాను గుడ్ సినిమా బ్యానర్‌పై కిరణ్ కే తలసిల సమర్పణలో బొడ్డు అశోక్ నిర్మిస్తున్నారు. ఇందులో పోసాని కృష్ణ మురళీ, రఘు, హేమా, గాయత్రి భార్గవి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UO42SD

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....