Sunday, 25 July 2021

Kalyaan Dhev : కాశ్మీరు లోయలో కళ్యాణ్ దేవ్.. హీరోయిన్‌తో మెగా అల్లుడి రొమాన్స్!

మెగా అల్లుడు ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. మొదటి చిత్రం విజేతతో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఈ చిత్రం వచ్చి మూడేళ్లు అవుతున్నా కూడా మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. మధ్యలో ఎన్నెన్నో మలుపులు తిరిగాయి. ప్రాజెక్ట్‌లు చేతులు మారాయి. కథ, కథనాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అలా మొత్తానికి రెండు, మూడో ప్రాజెక్ట్‌లు ఓ కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ తన నాల్గో ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సూపర్ మచ్చి పనులు దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆ తరువాత కిన్నెర సాని అనే మరో సినిమాను ప్రారంభించేశారు. కరోనా, లాక్డౌన్ వంటి వాటి వలన షూటింగ్‌లు వాయిదా పడుతూ వచ్చింది. అలా మొత్తానికి కళ్యాణ్ దేవ్ సెకండ్, థర్డ్ ప్రాజెక్ట్‌లు ఓ కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు నాల్గో ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టేశారు. పీపుల్ మీడియా ఫాక్టర్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్షంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇందులో కళ్యాణ్ దేవ్‌కు జోడిగా అవికా గోర్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ కాశ్మీర్ లోయలో ఎంజాయ్ చేస్తోంది.హీరో హీరోయిన్ల మీద రొమాంటిక్ సీన్లను యూనిట్ చిత్రీకరిస్తోన్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ అక్కడి అందాలను తన కెమెరాలో బంధిస్తోన్నట్టు కనిపిస్తోంది. అక్కడి షూటింగ్, వాతావరణాన్ని కళ్యాణ్ దేవ్ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీధర్ సీపాన తెరకెక్కిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i08Htk

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...