తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదనేది ప్రతి ఒక్క సెలబ్రిటీ చెబుతుంటారు. తోటి హీరోలు, నటీనటులతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడం తారక్ నైజం. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఈ విషయం చెప్పారు. కాకపోతే ఎన్టీఆర్, స్నేహం ఎంతో ప్రత్యేకమైందని భావిస్తుంటారు జనం. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో రాజీవ్ రోల్ కీలకంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ రావడంపై రాజీవ్ ఓపెన్ అయ్యారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ''స్టూడెంట్ నెం.1, ఆది, నాగ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్'' లాంటి చిత్రాల్లో రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఎప్పుడూ స్నేహంగా ఉంటూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండే రాజీవ్, తారక్ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది. ఇదే విషయమై ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా.. రాజీవ్ కనకాల ఓపెన్ అయ్యారు. తారక్ చాలా ఫ్రెండ్లీ క్యారెక్టర్ అని, తానొక్కడినే కాదు ఇంకో 15 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఆయనకున్నారని చెప్పారు. ఫ్రెండ్ షిప్ చేస్తే ప్రాణమిచ్చే వ్యక్తి తారక్ అని తెలిపారు. తారక్‌తో ఎంత సమయమైనా సరే.. అలా సరదాగా గడుస్తుందని చెప్పిన రాజీవ్ కనకాల, ఓవర్ నైట్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి స్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పారు. పెళ్లి తర్వాత కూడా 24 గంటలు అంటి పెట్టుకుని ఉంటే బాగుందడు కదా.. అందుకే తమ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, అయినప్పటీకీ ఏ మాత్రం సమయం దొరికినా ఇద్దరం కలుస్తుంటామని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నటించే ప్రతీ సినిమాలో తాను ఉండాలని ఆయన కోరుకుంటారని, దర్శకులకు నన్ను రికమెండ్ చేస్తుంటారని రాజీవ్ అన్నారు. అయితే డైరెక్టర్లను అలా ఫోర్స్ చేయొద్దని తాను అంటుంటానని, పాత్రకు సూట్ అయితే వాళ్ళే తీసుకుంటారని చెబుతుంటానని తెలిపారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కార్ యాక్సిడెంట్ అంశాన్ని కూడా ప్రస్తావించారు రాజీవ్. యాక్సిడెంట్ జరిగిన సమయంలో తాను మధ్య సీట్లో కుర్చున్నానని, ఒక్క తారక్‌కి మాత్రమే మేజర్‌గా గాయాలయ్యాయని తెలిపారు. దేవుడి దయ వల్ల బయటపడ్డామని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BFUzxp
No comments:
Post a Comment