Sunday, 25 July 2021

Hemangi Kavi : లోపల అది వేసుకోలేదని నటిపై ట్రోలింగ్.. జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిన అనుపమ!

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎవరిని నెటిజన్లు టార్గెట్ చేస్తారో చెప్పడం కష్టం. అలా గత వారంలో మరాఠీ నటి హేమంగీ కవికి వింత అనుభవం ఎదురైంది. తన ఇంట్లో తాను వంటగదిలో పని చేసుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఆ పని చూడటం, చపాతీలు చేసే విధానాన్ని చూడటం మానేసిన కొందరు ఆకతాయిలు తమ వక్రదృష్టికి పని చెప్పారు. బ్రా ధరించలేదా? అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అంతకు ముందు కూడా ఇలానే ఓ నటిని తన పర్సనల్ విషయాలపై కామెంట్ చేశారు. అయితే ఈ మాత్రం అలా తప్పుడు కూతలు కూసిన వారికి గట్టిగా కౌంటర్ వేసింది. అందరికీ ఉన్నట్టుగా నాకు కూడా ఉన్నాయి.. మనం కాళ్లు చేతులు పని చేస్తుంటే.. వాటికి తగ్గట్టు అవి కూడా అలానే కదులుతాయి.. ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఏం ధరించాలో ధరించకూడదో అది నా ఇష్టం అంటూ ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా పంచ్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ ఘటన మీద స్పందించారు. ఇలా తన మీద కూడా అప్పుడప్పుడు ట్రోలింగ్ వస్తుంటుంది. ఆ మధ్య తన ఫోటోలను మార్పింగ్ చేయడంపైనా ఫైర్ అయ్యారు. అయితే హేమంగీ కవి విషయంలో అనుపమ స్పందిస్తూ.. అది కచ్చితంగా మా ఛాయిస్.. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. మాకు నచ్చినట్టుగా ధరిస్తామనే ఉద్దేశ్యంలో అనుపమ కౌంటర్ వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BD40xk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....