Sunday, 25 July 2021

ఏ ఒక్క హీరో కూడా సొంతంగా ఎదగలేడు.. ‘నారప్ప’పై వెంకీ ఎమోషనల్

విక్టరీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఫ్యామిలీ హీరోగానే కాకుండా మాస్ హీరోగానూ తన సినిమాలతో వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేశారు. ఇక వెంకటేష్ చేసే రీమేక్ సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుంటాయి. ఒరిజినల్ సినిమాల కంటే వెంకీ చేసిన రీమేక్ చిత్రాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. అలా ఈ మధ్య నారప్పగా వెంకీ తన విశ్వరూపాన్ని చూపించారు. తమిళంలో అసురన్ తెలుగులో నారప్పగా వచ్చేశారు. గత వారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హాట్ టాపిక్ అవుతోంది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలు చెలరేగాయి. ఓటీటీలో వద్దని కొందరు గొడవలు చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వచ్చి వాపోయారు. కొందరు అభిమానులు వినూత్న నిరసనలు చేశారు. నారప్పను థియేటర్లోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ చివరకు నారప్ప ఓటీటీలోనే వచ్చింది. అందరి నోటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అలా నారప్ప పాసైపోయాడు. నారప్పగా వెంకటేష్ నటన, ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. అయితే సినిమా హిట్ అవ్వడం ఒక్కరి చేతిలో ఉండదని అదంతా కూడా సమష్టి కృషి అని నారప్ప టీం గురించి చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెంకీ.. ఏ ఒక్క హీరో కూడా సొంతంగా ఎదగలేడు. నారప్పను ఇంత స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్‌గా నిలబెట్టిన మా టీం అందరికీ థ్యాంక్స్ అని యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VbjaJq

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...