Sunday, 25 July 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: ఆయనతో కలిసి వాణి.. నవ్వులతో ముంచేస్తున్న హెబ్బా.. తెగకష్టపడుతున్న అంజలి

ఆయనతో కలిసి షూటింగ్ విశేషాలు పంచుకున్న వాణి ‘ఆహా కళ్యాణం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . తెలుగు చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ.. ఈ భామకు క్రేజ్ మాత్రం తక్కువ లేదు. తాజాగా తన తాజా షూటింగ్‌కు సంబంధించిన వివరాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. షూటింగ్‌ వెనుక జరిగేది ఇదే అంటూ ఆమె అక్షయ్ త్యాగితో కలిసి దిగిన వీడియోని షేర్ చేసింది. కంటి చూపుతో తుఫాను సృష్టిస్తాను: అండ్రియా ఒక నటిగా మాత్రమే కాదు.. సింగర్‌గా, డ్యాన్సర్‌‌గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది నటి . ‘యుగానికొక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాలతో వినోదాన్ని పంచారు. కొంతకాలంగా సోషల్‌మీడియా ద్వారానే ప్రేక్షకులకు చేరువలో ఉన్నారు. తాజాగా.. ‘కంటి చూపుతోనే తుఫాను సృష్టిస్తాను’ అంటూ తన నాభి అందాలను ఫోకస్ చేస్తూ.. ఆమె ఓ పోస్ట్ చేశారు. తెగకష్టపడిపోతున్న .. ‘ఏమో.. నాకు అన్ని తెలిసిపోతాయి’ అంటూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన నటి అంజలి. ఈ ఏడాది ‘వకీల్‌సాబ్’ సినిమాతో ఆమె మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా తన ఫిట్‌నెస్‌కి కారణం ఏంటనే విషయాన్ని అంజలి బయటపెట్టింది. ఓ అరుదైన యోగా భంగిమలో ఆమె ఫోటో పోస్ట్ చేసింది. ‘నేను తలవంచుకున్నాను.. కానీ, విరిగిపోను’ అంటూ ఆమె పేర్కొన్నారు. నీడలో అలా కనిపిస్తున్న దీపికా బాలీవుడ్ నటి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏ సినిమా చేసినా అది ఓ సంచలనం అవుతుంది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసి తన సత్తా నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన కొత్త సినిమాకు సంకేతంగా సగతం నీడలో ఉండి ఓ ఫోటోని పోస్ట్ చేశారు దీపికా. మరి ఇది దేనికి సంకేతం అనే విషయంపై దీపికానే క్లారిటీ ఇవ్వాలి. నవ్వులు చిందిస్తూ.. హెబ్బా ఫోటో.. హీరోయిన్ సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తరచూ హాట్ ఫోటోషూట్‌లు నిర్వహిస్తూ.. ఆమె అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతారు. తాజాగా నవ్వుల పూవులు పూయిస్తూ.. కొంచెంగా తన అందాలను చూపిస్తూ.. ఆమె ఓ సెల్ఫీని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kT7FBf

No comments:

Post a Comment

'LIC sets sights on sustained 60% plus market share'

'LIC will reduce but not fully exit its stake in IDBI Bank, which remains an important bancassurance partner,' says LIC of India...