Sunday, 25 July 2021

ఓ వైపు దుప్పటి కప్పుకుని మరో వైపు తింటూ.. షూటింగ్ గ్యాప్‌లో నిహారిక రచ్చ

మెగా డాటర్ సోషల్ మీడియాలో చేసే సందడి మామూలుగా ఉండదు. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన స్నేహితుడు, తన ప్రాజెక్ట్‌లకు దర్శకుడైన ప్రణీత్ బర్త్ డే సందర్బంగా నిహారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిహారిక నటించిన వెబ్ సిరీస్, సినిమాకు ప్రణీత్ దర్శకత్వం వహించారు. ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి, సూర్యకాంతం వంటి ప్రాజెక్ట్‌లను తెరకెక్కించారు. అలా నిహారికతో ప్రణీత్ జర్నీ కొనసాగుతూ వస్తోంది. తన ఫ్రెండ్‌కు నిహారిక చెప్పిన విషెస్ బాగానే వైరల్ అయ్యాయి. ప్రణీత్ బర్త్ డే సందర్భంగా గ్యాంగ్ అంతా కూడా రెట్రో థీమ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో ఒక్కొక్కరు ఒక్కో హీరో హీరోయిన్ క్యాస్టూమ్‌ను ఫాలో అయ్యారు. అతిలోక సుందరి శ్రీదేవీగా నిహారిక, బావగారూ బాగున్నారా స్టైల్లో నిహారిక భర్త చైతన్య కనిపించారు. ఇలా నిహారిక వెరైటీగా ప్లాన్ చేసిన ఈ థీమ్ పార్టీ బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా నిహారిక షూటింగ్ గ్యాప్‌లో రీల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మనం సినిమా చూసేటప్పుడు కొంతమంది విసిగిస్తుంటారు. తరువాత ఏం జరుగుతుంది? అదేంటి? ఇదేంటి? అని నసపెడుతుంటారు. అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఎవరైనా డిస్టర్బ్ చేశారా? అని నిహారిక ఓ రీల్ వీడియోను చేశారు. ఇందులో ప్రణీత్, నిహారిక సినిమా చూస్తున్నట్టుగా నటించారు. ఇక మధ్య మధ్యలో నిహారిక ప్రశ్నలు అడగడంతో ప్రణీత్ అరిచేసేశాడు. అలా మొత్తానికి నిహారిక చేసిన ఈ ఫన్నీ వీడియోలో అలా దుప్పటి కప్పుకోవడం, తింటూ ఉండటం అన్నీ కూడా క్లిక్ అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UPKixM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....