Thursday, 9 July 2020

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ నయా సెన్సేషన్.. భలే టార్గెట్ చేశాడే!!

రూపొందిస్తున్న 'పవర్ స్టార్' సినిమా నుంచి పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఈ రోజు (జులై 9) ఉదయం 11 గంటల 37 నిమిషాలకు పోస్టర్ విడుదల చేయబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించిన వర్మ.. సరిగ్గా చెప్పిన సమయానికే ఆటం బాంబ్ వేశారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ ద్వారానే సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా అందరికీ బిగ్ షాకిచ్చారు. ‘పవర్ స్టార్’ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీ పవన్ కళ్యాణ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోందనే టాక్ వినిపించింది. అయితే తాను పవన్ బయోపిక్ రూపొందించడం లేదని కన్ఫర్మ్ చేసిన వర్మ.. టైటిల్ పోస్టర్ ద్వారానే ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉంటుందనే హింట్ ఇచ్చేశారు. టైటిల్ మధ్యలో గాజు గ్లాసు (జనసేన పార్టీ గుర్తు) పెట్టి పలు అనుమానాలకు తెరలేపారు. Also Read: తాజాగా ఆ అనుమానాలను నిజం చేస్తూ పవర్ స్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు వర్మ. ఇందులో కనిపిస్తున్న నటుడు అచ్చం పవన్ కళ్యాణ్ పోజ్ పెట్టి కూర్చోవడం చూస్తుంటే.. వర్మ టార్గెట్ గట్టిగానే పెట్టారని తెలుస్తోంది. పైగా ఈ పోస్టర్‌పై ''ఎన్నికల ఫలితాల తర్వాత కథ'' అని రాయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలకు తెరలేపింది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై వర్మ కన్నేశారని జనం చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాను తన రెగ్యులర్ స్టైల్ లోనే థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ (ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్)లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ కానుందని పేర్కొన్నారు. సో.. చూడాలి మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W0ltwt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....