Sunday, 26 July 2020

నువ్వు నా హ్యాపీ ప్లేస్ చే.. కాబోయే భర్తపై ప్రేమను చాటుకున్న నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి కొణిదెల పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. తాను చేసుకోబోయే అబ్బాయిని నిహారిక ఇప్పటికే పరిచయం చేశారు. చైతన్యతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆగస్టులో నిహారిక-చైతన్య నిశ్చితార్థం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వదంతులు వచ్చాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. Also Read: ఇదిలా ఉంటే, తనకు కాబోయే భర్తతో తీసుకున్న ఫొటోలను తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు షేర్ చేయడానికి కారణం ఆదివారం (జులై 26న) చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నిహారిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ‘‘ఒక చిరునవ్వు మొత్తం గదిని కాంతివంతం చేస్తుంది. కౌగిలింతలు ఇల్లులా అనిపిస్తాయి. నువ్వు నీ దగ్గర నేను ఎంతో సంతోషంగా ఉంటాను చే’’ అని తన భర్తపై ప్రేమను చాటుకున్నారు నిహారిక. కాగా, ఈ పెళ్లిని మెగాస్టార్ చిరంజీవి కుదర్చినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులని సమాచారం. అందువల్ల ఈ రెండు కుటుంబాలు చాలా కాలంగా టచ్‌లో ఉన్నాయట. నిహారికకు పెళ్లి సంబంధాలు చూడాలని నాగబాబు అన్నప్పుడు.. చిరంజీవికి వెంటనే చైతన్య గుర్తుకువచ్చారట. దీంతో ఐజీ ప్రభాకర్ రావుతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. చైతన్య, నిహారికలు ఒకరికొకరు ఇష్టపడటంతో పెళ్లికి ద్వారాలు తెరుచుకున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hwtWQq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....