Saturday, 18 July 2020

నితిన్ పెళ్లిపై అఫీషియల్ ప్రకటన.. డేట్ అండ్ టైం వచ్చేసింది

అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. జూలై 26న హైద‌రాబాద్‌లో రాత్రి 8:30 గంట‌ల‌కు షాలినితో క‌లిసి ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు నితిన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న పాటిస్తూ.. వీరి వివాహ వేడుకను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌తో పాటు స‌న్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజ‌ర‌ుకానున్నారు. తన స్నేహితురాలు.. డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, నూర్జహాన్ కుమార్తె షాలినితో ఫిబ్రవరి నెలలో నితిన్‌కు ఫిబ్రవరిలోనే పసుపు, కుంకుమ ఫంక్షన్ జరిగింది. ఏప్రిల్ 15న పెళ్లి, 16న దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌లో ఈ పెళ్లి వేడుకను అంగరంగవైభవంగా జరిపేందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ డెస్టినేషన్ మ్యారేజ్‌కు 100 మంది గెస్ట్‌లను కూడా ఆహ్వానించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో దుబాయ్‌తో పాటు అన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ డెస్టినేషన్ పెళ్లి దుబాయ్‌లో జరిపించమే ప్రధాన సమస్యగా మారడంతో హీరో నితిన్ తన పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి నితిన్ పెళ్లిపై అనేక పుకార్లు వస్తుండంతో వీటన్నింటికీ తెరదించుతూ.. నితిన్-షాలిని పెళ్లిని ఈ నెల 26న జరిపించేందుకు ఇరుకుటుంబాల పెద్దలు నిశ్చయించారు. కాగా.. ‘భీష్మ’తో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’, ‘చెక్’ అనే రెండు చిత్రాలను చేస్తున్నారు. వీటితో పాటు.. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘అంధాధున్’ రీమేక్‌.. కృష్ణ‌చైత‌న్య డైరెక్ష‌న్ లో ‘ప‌వ‌ర్ పేట’ చిత్రాలను లైన్‌లో పెట్టాడు నితిన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CIu4xc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....