Sunday, 26 July 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమం.. భాగమైన చిరంజీవి, రామ్ చరణ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో భాగం పంచుకుంటున్నారు. ఈ మేరకు భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీ హిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే భారీ కార్యక్రమమాన్ని ప్రారంభించడం జరిగింది. Also Read: ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు మెగాస్టార్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ‘హరితహారం’లో భాగంగా నడుస్తున్న ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి.. భవిష్యత్తులో మొక్కల ఆవశ్యకత గురించి వివరించారు మెగాస్టార్. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' మూవీ చేస్తుండగా, రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్నారు . కరోనా విలయతాండవం కారణంగా ఈ రెండు సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గాకే సేఫ్‌గా సెట్స్ మీదకు రావాలని భావిస్తున్నారట చిరంజీవి, రామ్ చరణ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WVusjh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....