సీనియర్ నటి జయంతి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కొంతవరకు మెరుగు పడినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడకపోవడం, ఆస్తమా సమస్యలతో మంగళవారం రాత్రి ఆమెను బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్చారు. దీంతో డాక్టర్లు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆమెకు నెగిటివ్‌గా వచ్చింది. నాలుగు నెలల క్రితం కూడా ఆమె అస్తమాతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం జయంతి బెంగళూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఉన్నారు. దక్షిణాదిలో తెలుగు, కన్నడం, తమిళం, మలయాళ రంగాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ జయంతి నటించారు. ప్రత్యేకించి కన్నడ సినీ రంగంలో ఆమెకి మంచి గుర్తింపు లభించింది. పలు పురస్కారాలు ఆమెను వరించాయి. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సహా పలువురు ప్రముఖ హీరోల సరసన జయంతి నటించారు. ఆమె నటనకు అనేక అవార్డులు కూడా దక్కాయి. కర్ణాటకలో ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31XOuwP
No comments:
Post a Comment