Sunday, 19 July 2020

Bandla Ganesh: పవర్ స్టార్‌ అభిమానులకు ఈ ఏడాది పండగే.. కాకపోతే కండిషన్స్ అప్లై!! ఓపెన్ అయిన బండ్ల గణేష్

పవర్ స్టార్ భక్తుడని చెప్పుకునే మరోసారి ఓపెన్ అయ్యారు. పవన్‌తో సినిమా చేయాలన్న తన కోరికను బయటపెడుతూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు. పవర్ స్టార్‌ అభిమానులకు ఈ ఏడాది పండగే! అని చెబుతూనే.. అది జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయని, అవి అప్లై అయితేనే అది కుదురుతుందని అన్నారు. ఈ మేరకు గతంలో పవన్‌ కళ్యాణ్ హీరోగా తాను నిర్మించిన '' సినిమాలోని టైటిల్ సాంగ్ ట్యాగ్ చేస్తూ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశారు. ''ఆ పరమేశ్వరుడు మళ్లీ నాకు పవర్ స్టార్‌తో సినిమా నిర్మించే అవకాశం ఇస్తే.. మన పవర్ స్టార్ అభిమానులు ఈ సంవత్సరం పాటు పండగ చేసుకునే విధంగా సినిమా తీస్తా. ఇది నా సంకల్పం'' అని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా మనసులో మాట బయటపెట్టేశారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో 'గబ్బర్ సింగ్' సినిమా నిర్మించి బండ్ల గణేష్ మంచి లాభాలు గడించారు. ఈ క్రమంలోనే మరోసారి పవన్‌తో సినిమా చేసే అవకాశం కోసం ఆయన వెయిట్ చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా 'గబ్బర్ సింగ్' మూవీ విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే తన ఇంట్లోనే బండ్ల గణేష్ హోమ్ చేసిన సంగతి తెలిసిందే. ''అందరూ పుట్టిన రోజు నాడు పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు కానీ.. నేను నా కుటుంబ సభ్యులతో గబ్బర్ సింగ్ విడుదల రోజు గణపతి హోమం చేశాను. గబ్బర్ సింగ్ అనేది నాకు దైవ సమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష. ఎప్పటికీ ఆయనకు నేను కృతజ్ఞుణ్ణి'' ఆ రోజు బండ్ల గణేష్ పేర్కొన్నారు. Also Read: ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు అంశాలపై రెగ్యులర్‌గా స్పందిస్తున్న బండ్ల గణేష్.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పిస్తూ ఆయన గురించిన కామెంట్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. 'రాజకీయాలు వద్దు.. సినిమానే ముద్దు' అని అంటున్న ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా మరో సినిమా నిర్మించాలని ధృడ సంకల్పంతో ఉన్నారు. సో.. చూడాలి మరి మనోడికి పవన్.. ఆ ఛాన్స్ ఇస్తారో లేదో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2CQgBDq

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....