Sunday, 5 July 2020

Ardhashathabdham: దగ్గుబాటి రానా రిలీజ్ చేసిన 'అర్ధ శతాబ్దం' గ్లింప్స్.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో

క్రమంగా చిన్న సినిమాలకు ఆధరణ పెరుగుతూ వస్తోంది. హీరో హీరోయిన్స్ ఎవరనేది పక్కనబెట్టి కథాకథనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. పైగా ఇలాంటి సినిమాకు పెద్ద హీరోల సపోర్ట్ కూడా లభిస్తుండటంతో ఇటీవలి కాలంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ భారీ విజయాలందుకోవడం చూస్తున్నాం. ఈ బాటలోనే '' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో 'కేరాఫ్ కంచెరపాలెం' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోగా నటిస్తున్నాడు. ఈ రోజు (జులై 5) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ 'అర్ధ శతాబ్దం' మూవీ నుంచి కార్తిక్ రత్నం గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ హీరో చేతుల మీదుగా 'ఎ గ్లింప్స్ ఆఫ్ కృష్ణ' పేరుతో ఈ వీడియో విడుదలైంది. ఇందులో కేవలం హీరో కార్తిక్ రత్నంని మాత్రమే చూపిస్తూ పాత కాలంనాటి ఇల్లు, పల్లె వాతావరణాన్ని ఫోకస్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. చిత్రంలో కార్తిక్ రత్నం వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడని స్పష్టమవుతోంది. Also Read: రిషిత శ్రీ క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై ర‌వీంద్ర పుల్లే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'అర్ధ శతాబ్దం' మూవీలో కార్తిక్ రత్నం సరసన కృష్ణ ప్రియ నటిస్తోంది. నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించనున్నాడు. చిట్టి కిర‌ణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అతిత్వరలో ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31Nvlxh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....