Sunday, 12 July 2020

‘భజరంగి-2’ టీజర్‌కు సూపర్ రెస్పాన్స్.. పాన్ ఇండియా ప్లాన్!

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త చిత్రం ‘భజరంగి-2’ టీజర్ విడుదలైంది. ఈ మూవీ 2013లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘భజరంగి’ చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయినప్పటికీ పాన్ ఇండియా మూవీ మాదిరిగా బాలీవుడ్‌తో సహా అన్ని దక్షిణాది భాషల సినీ ప్రేమికులు ఈ చిత్ర టీజర్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తూ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం. ఈ రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోతోంది. అసలు ఈ స్థాయిలో స్పందనను వాళ్లు ఊహించలేదట. ప్రస్తుతం టీజర్‌కు వస్తోన్న స్పందన చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే తెలుగులో కూడా ఈ సినిమా అనువాదం కానుంది. టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేసినట్టు సమాచారం. Also Read: కాగా, టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ గురుంచి హీరో శివరాజ్‌ కుమార్ మాట్లాడుతూ.. ‘‘2013లో మేం తీసిన ‘భజరంగి’ పెద్ద హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా ఈ ‘భజరంగి-2’ మూవీని భారీగా తీయాలని భావించాం. కానీ, ఈ టీజర్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుండి కాల్స్ వస్తున్నాయి. ఈ అద్భుతమైన రెస్పాన్స్ కి అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు. కాగా, ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ బాక్ గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ షాట్స్ చూస్తుంటే మరో ‘కె.జి.ఎఫ్’ తరహా సినిమా కాబోతుంది అనిపిస్తుందని అంటున్నారు. పీరియాడిక్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో శివరాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్‌గా నటించారు. జయన్న ఫిలిమ్స్ బ్యానర్‌పై జయన్న, భోగేంద్ర కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎ.హర్ష డైరెక్ట్ చేశారు. థియేటర్‌లు ఓపెన్ అవ్వగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WbREJL

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....