మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ వేదికపై `మా`లో నెలకొన్న వివాదాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. గత కొద్ది రోజులుగా మా అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్, ఉపాద్యక్షుడు, కార్యదర్శి రాజశేఖర్, జీవితల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మా డైరీ వేదికగా ఈ వివాదం మరోసారి బయటపడింది. డైరీ ఆవిష్కరణ తరువాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి అసోషియేషన్‌లో గొడవలన్ని మర్చిపోయి అంతా కలిసి పనిచేయాలని సూచించారు. మంచి మైకులో చెప్పండి.. చేడు చెవిలో చెప్పండి అంటూ అసోషియేషన్ సభ్యులకు హితవు పలికారు. అయితే చిరంజీవి మాట్లాడుతున్నంతసేపు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డ రాజశేఖర్, తరువాత వ్యాఖ్యాత పరుచూరి గోపాలకృష్ణ చేతిలో మైకు తీసుకొని మాలో వివాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. Also Read: మా అసోషియేషన్‌లో గ్రూపులు ఫాం అయినట్టుగా చెప్పిన రాజశేఖర్, కొంత మంది వ్యక్తులు తెర మీద హీరోలుగా ప్రవర్తించినా నిజ జీవితంలో మాత్రం అలా హీరోగా ప్రవర్తించే వారిని మాత్రం తొక్కేస్తున్నారన్నాడు. నిప్పు ఉన్నప్పుడు దాన్ని కప్పిపుచ్చేందుకు ఎంత ప్రయత్నించినా పోగరాకుండా ఆపలేం అంటూ వివాదాలపై వ్యాఖ్యానించాడు. మాలో అంతా సవ్యంగా లేదని చాలా తప్పులు జరుగుతున్నాయని ఆరోపించాడు. అయితే రాజశేఖర తీరుపై వేదిక మీద ఉన్న పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజశేఖర్ వేదిక మీద ఉన్న పెద్దలను అవమానించేలా ప్రవర్తించారని చిరు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గొడవల గురించి పబ్లిక్‌గా చర్చించ వద్దని చెప్పినా వినకుండా రాజశేఖర్ వేదిక మీద మాట్లాడటం సరికాదన్నారు. ఆయన కావాలనే ఈ కార్యక్రమాన్ని రసాభాసగా మార్చేందుకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తం చేసిన చిరు, రాజశేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీకి సూచించారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qe5fxn
No comments:
Post a Comment