మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కర కార్యక్రమంలో రాద్ధాంతం చేసిన రాజశేఖర్.. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు వీకే నరేష్ వ్యవహారశైలి నచ్చకే తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో రాజశేఖర్ వెల్లడించారు. అయితే, రాజశేఖర్ రాజీనామాను ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు అధ్యక్షుడు నరేష్, ముఖ్య సలహాదారు కృష్ణంరాజు సంతకాలతో కూడిన ఒక ప్రెస్ నోట్‌ను ‘మా’ ఆదివారం విడుదల చేసింది. క్రమశిక్షణా కమిటీ ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి సూచనలను ఉటంకిస్తూ రాజశేఖర్ ఇష్టానుసారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. బహిరంగ వేదికపై ‘మా’పై తీవ్ర ఆరోపణలు చేసిన రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని అక్కడే చిరంజీవి అన్నారు. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీని ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. చిరంజీవి సూచనల మేరకు ‘మా’ క్రమశిక్షణా కమిటీని ఏర్పాటుచేస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీ మోహన్, మోహన్ బాబు, జయసుధలను సభ్యులుగా నియమించింది. రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ వ్యవహార శైలిపై జీవిత, రాజశేఖర్ దంపతులు మొదటి నుంచీ అసంతృప్తితో ఉన్నారు. నరేష్‌పై ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేశారు. అయితే, ‘మా’ పెద్దలంతా పాల్గొన్న వేదికపై రాజశేఖర్ కాస్త దురుసుగా మాట్లాడటంతో వాతావరణం వేడెక్కింది. చిరంజీవి సహా అంతా రాజశేఖర్‌ను తప్పుబట్టారు. దీంతో ఆయన రాజీనామా చేశారు. అయితే, నరేష్ పద్ధతి నచ్చకే తాను రాజీనామా చేసినట్టు లేఖలో రాజశేఖర్ పేర్కొన్నారు. Also Read: ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నాటి నుంచి అసోసియేషన్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ, ఉత్తమంగా పనిచేస్తున్నానని రాజశేఖర్ వెల్లడించారు. అయితే, ‘మా’లో సమస్యలను పరిష్కరించడానికి బదులు అధ్యక్షుడు నరేష్ కమిటీ సభ్యులను ఉద్దేశించి కించపరిచేలా, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పారదర్శకతకు నీళ్లొదిలి, పదే పదే తప్పులు మీద తప్పులు చేస్తూ, మెజార్టీ సభ్యులు ఆమోదించిన నిర్ణయాలను పక్కన పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. Also Read: తాను భావోద్వేగాన్ని నియంత్రించుకోలేనని, మనసులో ఉన్నది ఉన్నట్టు బయటపెట్టేస్తానని ‘డైరీ’ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన అంశం గురించి ప్రస్తావించారు. మొత్తం మీద రాజశేఖర్ వల్ల ‘మా’లో కొత్త మార్పులు వచ్చాయి. మరి కొత్తగా ఏర్పాటైన క్రమశిక్షణా కమిటీ రాజశేఖర్‌పై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36svtlk
No comments:
Post a Comment