Friday, 3 January 2020

ప్రముఖ సింగర్ కౌసల్యకు సైబర్ వేధింపులు.. దరిద్రమైన మెసేజ్‌లు చేస్తూ..

సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలకు ఎదురయ్యే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఇక సినీ ప్రముఖుల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని తిట్లు తిట్టినా భరించక ఏం చేస్తారు అనుకుంటారో ఏమో తెలీదు కానీ ఈ మధ్య ట్రోలింగ్ మితి మీరిపోతోంది. తాజాగా ప్రముఖ గాయని సైబర్ వేధింపుల బారిన పడ్డారు. తన ఫోన్ నెంబర్ తెలుసుకుని రోజూ దరిద్రమైన మెసేజ్‌లు పంపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన బాధను వ్యక్తం చేశారు. ‘‘నాకే కాదు కౌసల్య మ్యూజిక్ అకాడమీలోని కొందరు అమ్మాయిలకు కూడా ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ఒకే నెంబర్ నుంచి కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు కుమ్మక్కై ఇలా చేస్తున్నారనిపిస్తోంది. ఇది ఇప్పటి సమస్య కాదు గత మూడేళ్లుగా ఈ వేధింపులను ఎదుర్కొంటున్నాం. ఓసారి ఓ కార్యక్రమం కోసం పోస్టర్లు సిద్ధం చేయించి మా నెంబర్లు కూడా ప్రింట్ చేయించాం. ఆ నెంబర్ ఆధారంగా ఇలా మెసేజ్‌లు చేస్తున్నారు. మాలాగా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతీ ఆడపిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలపై ఫిర్యాదులు చేసేందుకు పోలీసులు ఓ వాట్సాప్ గ్రూప్ పెడితే బాగుంటుంది’’ అని తెలిపారు. See Photo Story: అంతేకాదు ఇలాంటి ఆకతాయిల నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు కొన్ని నెంబర్లను బ్లాక్ చేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఆమె ఏకంగా 342 నెంబర్లను బ్లాక్‌లో పెట్టారంటే ఆమెకు సైబర్ వేధింపులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోండి. అన్ని నెంబర్లు బ్లాక్ చేసినప్పటికీ ఇంకా కొత్త నెంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తుండడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37ALCFM

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8