Thursday 2 January 2020

వినండి చిరు, మోహన్ బాబు గారూ.. అరిస్తే ఏం కాదిక్కడ: రాజశేఖర్ రచ్చ రచ్చ

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ డైరీ ఆవిష్కరణ సభ రసాభసగా మారింది. మా ప్రెసిండెంట్‌గా ఉన్న , అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ల మధ్య గతంకొంతకాలంగా బహిరంగంగానే వార్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య నడుస్తున్న వివాదాలకు మరోసారి వేదికైంది మా డైరీ ఆవిష్కరణ సభ. గురువారం నాడు జరిగిన ఈ డైరీ ఆవిష్కరణకు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, క్రిష్ణం రాజులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్ ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో మెగాస్టార్ మాట్లాడుతున్న సందర్భంలో రాజశేఖర్ పదే పదే అడ్డుపడతూ వేదికపై రచ్చ చేయడంపై మెగాస్టార్ ఫైర్ అయ్యారు. ఇదేనా సంస్కారం.. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి. అయితే మళ్లీ వేదికపైకి వచ్చిన రాజశేఖర్.. పరుచూరి మాట్లాడుతున్న సందర్భంలో మైక్ తీసుకుని.. పెద్దలందరికీ కాళ్లకి దండం పెడుతున్నా అంటూ స్టేజ్ మీద ఉన్న అందరి కాళ్లకు నమస్కారం చేయడంతో చిరంజీవి, మోహన్ బాబు.. ఏం చేస్తున్నావ్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారూ బ్రహ్మాండంగా మాట్లాడారు. మా ఎన్నికల తరువాత నేను సినిమాకూడా చేయలేదు. వీటివల్ల మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను మెంటల్‌గా ప్రవర్తిస్తున్నారని ఇంట్లో తిట్టారు. చివరికి నాకు పెద్ద యాక్సిడెంట్ కావడానికి, నా కారు పోవడానికి కూడా ‘మా’ కారణం. చిరంజీవి గారు అందరూ కలిసి ఉండాలని చాలా బాగా మాట్లాడారు. బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చారు. లోకంలో ఇలాగే మాట్లాడాలి. కాని ఇక్కడ ఒక నిప్పుని కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదు. మంచి మైక్‌లో చెప్పమని చెడుని చెవిలో చెప్పమని చిరంజీవి గారు చెప్తున్నారు. కాని వాస్తవంలో నిప్పు ఉంటే పొగ వస్తుంది. చిరు, మోహన్ బాబులు వారిస్తుండగా.. ‘నన్ను మాట్లాడనీయండి.. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా కదా.. వినండి. అందరి ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి.. వాటిని కప్పిపుచ్చుకుంటున్నారు. మనం హీరోలుగా సినిమాల్లో నటిస్తున్నాం.. కాని రియల్ లైఫ్‌లో లొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు, చిరంజీవి గారూ.. మీరు అరిస్తే ఇక్కడ ఏం కాదు. నేను మీ గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్‌లో ఉన్న 26 మందిలో 18 ఒకవైపు 8 ఒకవైపు. ఇంతకుముందు శివాజీ, శ్రీకాంత్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు లేవని చిరంజీవి గారు అన్నారు. కాని ఇప్పుడు వాళ్లనే తప్పుచేశారని నరేష్ గారు ముందుకు వచ్చి చెప్తున్నారు. మా ఇంత దారుణంగా ఉంది. ఏది సక్రమంగా జరగడం లేదు. నేను ఇలాగే మాట్లాడతా.. ఇలాగే ఉంటా.. దీని వల్ల నాపై నిందలు వేసినా పర్లేదు. నేను సత్యంగా బతకాలని అనుకుంటున్నా. అందుకే నిజాన్ని చెప్తున్నా. నేనేం చిన్నపిల్లాడిని కాదు.. కప్పిపుచ్చేయడానికి’ అంటూ కోపంగా స్టేజ్ దిగి వెళ్లిపోయారు రాజశేఖర్. అనంతరం చిరంజీవి మైక్ తీసుకుని రాజశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు విలువ ఎక్కడ ఉంది. రాజశేఖర్ కావాలని ఈ రసాభస చేశారు. మాకు గౌరవం లేనప్పుడు మేం ఇక్కడ ఎందుకు ఉండాలి. ప్రొటోకాల్ లేకుండా మైక్ లాక్కోవడం ఎంతవరకూ కరెక్ట్. నేను ఇప్పటికీ మాట్లాడకపోతే మంచిగా ఉండదు.. నేను ఎంత సౌమ్యంగా ఉండాలనుకున్నా నాచేత కూడా కోపంగా మాట్లాడేటట్టు చేస్తున్నారు. రాజశేఖర్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా. మీకు ఇష్టం లేకపోతే రావొద్దు, వెంటనే ఇతనిపై గట్టి యాక్షన్ తీసుకోండి. అంటూ వార్నింగ్ ఇచ్చారు చిరంజీవి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ud7ybB

No comments:

Post a Comment

'Couldn't Imagine Chatting With Kamal'

'I was completely in awe of him. After the shot was okayed, I would quickly run back to my chair and sit quietly till I was called again...