Wednesday, 1 January 2020

నాన్నకు కాపీ ఆద్య.. పవన్ ఫ్యాన్స్‌కి రేణు దేశాయ్ న్యూ ఇయర్ ట్రీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ నుంచి రేణు విడాకులు తీసుకున్నా మెగా అభిమానులు మాత్రం ఆమెను ఇంకా వదినలానే చూస్తు్న్నారు. ఆమె పిల్లలను తమ హీరో పిల్లలని అభిమానిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చే అభిమానాన్ని, ఆదరణను రేణు దేశాయ్ పెద్దగా ఇష్టపడటంలేదు. అసలు ఆమెను పవన్ మాజీ భార్య అని అంటే చాలు చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పేరును కూడా సరిగా పలకని రేణు దేశాయ్.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజున తన మాజీ భర్త ఫొటోను ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కూతరు ఆద్యతో పవన్ కళ్యాణ్ దిగిన ఫొటో అది. ‘‘పిల్లలు లక్షణాలను తమ తల్లిదండ్రుల నుంచి చాలా విడ్డూరంగా, అందంగా పొందుతారు. కొన్నిసార్లు ఈమె చూడటానికి అచ్చం నాలానే ఉంటుంది. చాలా సార్లు వాళ్ల నానమ్మ, నాన్నకు కాపీలా అనిపిస్తుంది. ఆద్య నా కెమెరాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి’’ అని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మొన్నీమధ్య కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు రేణు. ‘‘మీరు 1, 2, 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా’’ అంటూ ఆద్య, అకీరాను ఉద్దేశించి ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఆద్య, అకీరా క్రేజీ ఫెలోస్ కానీ వాళ్లు నా సొంతం అని కూడా అన్నారు. ఈ పోస్ట్‌పై పవన్ అభిమానులు కొంత మంది విమర్శలు చేశారు. Also Read: ‘‘ఆ పిల్లలది ఎంతైనా పవన్ రక్తం కదా’’ అని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లకు రేణు దేశాయ్‌కి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేశారు. ‘‘సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు రేణు. పవన్ రక్తం అన్నందుకే అంత ఘాటుగా స్పందించిన రేణు.. మరి ఇప్పుడు పోలికలు చెబుతూ పవన్‌తో ఆద్య ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ పోస్ట్‌కు పవన్ ఫ్యాన్స్‌ ఘాటుగా స్పందిస్తారని అనుకున్నారో ఏమో కామెంట్స్‌ని కూడా డిసేబుల్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36g5EFg

No comments:

Post a Comment

'Why Would Govt Be Scared Of Cartoonists?'

'Journalists must ask the Mumbai police why are they sending notices via X to cartoonists.' from rediff Top Interviews https://ift...