Sunday, 22 September 2019

upasana: కోడలి ఫొటోలు తీసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి తన కోడలు ఉపాసన అంటే ఎంతో ప్రేమ, అభిమానం. కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఎంతో గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. ఎవరి సాయం లేకుండా ఇండస్ట్రీలో తన కాళ్లపై తాను నిలబడిన మామయ్య అంటే ఉపాసనకు అమితమైన ప్రేమ. కాగా.. తన మామయ్య నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ ఈవెంట్‌కు ఉపాసన కూడా హాజరయ్యారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన గౌనును ధరించారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఉపాసన తన మామయ్య చేత ఫొటోలు తీయించుకున్నారు. ఈ ఫొటోలను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సైరా నరసింహారెడ్డి ఈవెంట్‌కు ముందు నా స్వీటెస్ట్ మామయ్య నా ఫొటోలు తీశారు. నేను వేసుకున్న దుస్తులు ఆయనకు ఎంతో నచ్చాయి. అందుకే ఆయన ఫొటోలు తీశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు గోడపై కనిపిస్తున్న ఆయన ప్రతిరూపాన్ని మీరు చూడొచ్చు. ఈరోజు (ఆదివారం) జాతీయ కుమార్తెల దినోత్సవంతో పాటు సైరా వేడుక కూడా జరిగింది. ఇంతకంటే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోలేను. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అంతేకాదు ఉపాసన బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌ను కూడా నడుపుతున్నారు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి ఫిట్‌నెస్ విషయాలను మ్యాగజైన్‌లో పబ్లిష్ చేస్తుంటారు. ఈ మ్యాగజైన్స్ ద్వారా హెల్త్ అండ్ ఫిట్‌నెస్ విషయంలో ప్రజలకు ఉపాసన అవగాహన కల్పిస్తుంటారు. ఈ మ్యాగజైన్ కోసం కూడా ఫొటోషూట్ ఇచ్చారు. తన కెరీర్ గురించి ఆరు పదుల వయసులోనూ ఆరోగ్యంగా ఉండడం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ మ్యాగజైన్‌ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, నటి సమంతలతో పాటు ఉపాసన భర్త రామ్ చరణ్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కుటుంబ సభ్యుల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు తన అభిమానులు, రామ్ చరణ్ అభిమానుల కోసం ఎన్నో ఆరోగ్యకరమైన డైట్స్‌కు సంబంధించిన టిప్స్ కూడా చెబుతుంటారు. రోగాల బారిన పడకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తుంటారు. హెల్తీ రెసిపీస్ తయారుచేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34ZFwhy

No comments:

Post a Comment

''Have Muslims Faced Problems In Maharashtra?'

'We have given riot-free Maharashtra in our 18-month rule.' from rediff Top Interviews https://ift.tt/pLavVg8