ప్రముఖ సీనియర్ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు శివప్రసాద్ (68) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మరణించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో వినూత్న నిరసనలు తెలిపిన ఆయన తెలుగుదేశం సీనియర్ నేతగా పలు పదవులను నిర్వహించారు. 2009, 2014లలో చిత్తూరు ఎంపీగా గెలిపొందారు. 1999-2004 మధ్యకాలంలో ఎంఎల్ఎగా ఉన్నారు. 1999-2001 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారాయన. Read Also: తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. నాటకరంగంలో వివిధ పాత్రలు వేసిన ఆయన ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించారు. 1983 నుండి 2013 వరకూ ముప్పైగా పైగా చిత్రాల్లో నటించారు. శివప్రసాద్ నటించిన చిత్రాలు.. 1. ఖైదీ 2. యముడికి మొగుడు 3. మాస్టర్ కాపురం 4. ఆటాడిస్తా 5. ఆదివారం ఆడవాల్లకు సెలవు 6. సత్యభామ 7. సుభాష్ చంద్రబోస్ 8. యమగోల మళ్లీ మొదలైంది 9. ఆదిలక్ష్మి 10. జై చిరంజీవా 11. డేంజర్ 12. డేంజర్ 13. లక్ష్మి 14. కితకితలు 15. తులసి 16. ఒక్కమగాడు 17. ఆటాడిస్తా 18. బాలాదూర్ 19. కుబేరులు 20. ద్రోణ 21. మస్కా 22. బ్రహ్మలోకం టు యమ లోకం వయా భూలోకం 23. తకిట.. తకిట 24. జిల్ల జమీందార్ 25. అయ్యారే 25. దూసుకెళ్తా 26. సై ఆట నటడుగానే కాకుండా అనేక నాటకాలకు దర్శకత్వం వహించారాయన. సినిమాల్లో అనేక నటిస్తూనే.. నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు శివప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రాలు.. 1. ప్రేమ తపస్సు 2. టోపీ రాజా స్వీటీ రోజా 3. ఇల్లాలు 4. కొక్కొరొక్కో ప్రతినాయకుడిగా.. 2006 సంవత్సరంలో విడుదలైన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా నటించారు శివప్రసాద్. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IjjeNY
No comments:
Post a Comment